తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Gidugu Rudraraj Appointed As Apcc Chief

Gidugu Rudraraj : ఏపీసీసీ కొత్త చీఫ్‌గా గిడుగు రుద్రరాజు

HT Telugu Desk HT Telugu

23 November 2022, 21:57 IST

    • APCC New Chief Gidugu Rudraraj : ఆంధ్రప్రదేశ్ కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
గిడుగు రుద్రరాజు
గిడుగు రుద్రరాజు

గిడుగు రుద్రరాజు

ఏపీలో కాంగ్రెస్ పార్టీ చాలారోజులుగా సైలెంట్ గానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. రాజకీయ కార్యక్రమాలు కూడా ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేసినవి లేవు. దీంతో ఏపీసీసీ(APCC) ఛీఫ్ ను మార్చాలని అధిష్ఠానం భావించింది. శైలజానాథ్ పనితీరుపై అసంతృప్తిగా ఉంది. తాజాగా ఏపీసీసీ(APCC) అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు(Gidugu Rudraraj)ను కాంగ్రెస్(Congress) అధిష్ఠానం నియమించింది. వర్కింగ్ ప్రెసిడెంట్‍లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పీ.రాకేష్ రెడ్డి, ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ ఛైర్మన్‍గా పల్లంరాజు నియమితులయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

రుద్రరాజు.. ఏఐసీసీ(AICC) కార్యదర్శిగా.. ఒడిశా రాష్ట్ర సహాయ ఇన్ఛార్జిగా పని చేశారు. గతంలో ఎమ్మెల్సీ(MLC)గా కూడా చేశారు. వైఎస్ఆర్(YSR), కేవీపీ(KVP)లతో సన్నిహితంగా ఉండేవారు రుద్రరాజు. మెుదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. దీంతో ఆయనవైపు అధిష్ఠానం మెుగ్గుచూపింది.

పార్టీ బలోపేతానికి 18 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌(Political Affairs) కమిటీ, 34 మందితో కో ఆర్డినేషన్‌ కమిటీని నియమించింది అధిష్ఠానం. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా మస్తాన్‌వలీ, జంగా గౌతమ్‌, సుంకర పద్మశ్రీ, పీ రాకేష్‌, ప్రోగ్రామ్‌ కమిటీ ఛైర్మన్‌గా పల్లంరాజు, ప్రచార కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్‌, మీడియా కమిటీ ఛైర్మన్‌గా తులసిరెడ్డిని నియమించింది.