తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati Students Missing : తిరుపతిలో ఐదుగురు స్టూడెంట్స్ మిస్సింగ్.. ఏం జరిగింది?

Tirupati Students Missing : తిరుపతిలో ఐదుగురు స్టూడెంట్స్ మిస్సింగ్.. ఏం జరిగింది?

HT Telugu Desk HT Telugu

10 November 2022, 19:11 IST

    • Tirupati Crime News : తిరుపతిలో పదో తరగతి చదువుతున్న ఐగుగురు విద్యార్థులు మిస్ అయ్యారు. ఉదయం స్టడీ అవర్ కు వెళ్లిన వారు కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళన మెుదలైంది. వారే ఎక్కడికైనా వెళ్లారా? లేదంటే ఏదైనా జరిగిందా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తిరుపతి స్టూడెంట్స్ మిస్సింగ్
తిరుపతి స్టూడెంట్స్ మిస్సింగ్

తిరుపతి స్టూడెంట్స్ మిస్సింగ్

తిరుపతి(Tirupati)లో పదో తరగతి విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల్లో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. తిరుపతిలోని నెహ్రూనగర్(Nehru Nagar)లోని అన్నమయ్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదవుతున్నారు. నవంబర్ 9న విద్యార్థులు అదృశ్యమయ్యారు.

బుధవారం ఉదయం స్టడీ అవర్స్(Study Hours) కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులు ఇంటికి తిరిగి రాలేదు. ముగ్గురు బాలికలు గుణశ్రీ, మెహతాజ్, మౌనశ్రీ, , ఇద్దరు అబ్బాయిల అబ్దుల్ రెహమాన్, అతిఫ్ హుస్సేన్ (అతను 9వ తరగతి చదువుతున్నాడు)గా గుర్తించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

10వ తరగతి చదువుతున్న లుగురు విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, ఉదయం 8.00 గంటల ప్రాంతంలో పాఠశాల నుంచి బయటకు వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అల్పాహారానికి ఇంటికి వెళ్తున్నామని అన్నమయ్య ఇంగ్లీషు మీడియం పాఠశాల అధికారులు పోలీసులకు ఇచ్చారు.

'తప్పిపోయిన ఐదుగురు విద్యార్థుల గురించి పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రుల నుండి మాకు ఫిర్యాదు వచ్చింది. మేం వాస్తవాలను చూస్తు్న్నాం. పాఠశాల ఆవరణలో అమర్చిన సిసి కెమెరాలను పరిశీలిస్తున్నాం.' అని పోలీసులు తెలిపారు.