తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Doctors Walk In Recruitment For Various Posts In Andhra Pradesh Government Hospitals

Walk In Recruitment: ఏపీ వైద్యశాఖలో డాక్టర్ల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌….

HT Telugu Desk HT Telugu

21 March 2023, 7:06 IST

  • Walk In Recruitment: ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో  ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వివిధ  విభాగాల్లో  పని చేయడానికి వాకిన్ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ ప్రకటించారు.ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల్ని శాశ్వత,కాంట్రాక్టు పద్ధతుల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

ఏపీలో డాక్టర్ల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం
ఏపీలో డాక్టర్ల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం (unsplash)

ఏపీలో డాక్టర్ల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం

Walk In Recruitment: ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌లో వివిధ పోస్టుల భర్తీకి మార్చి 23 నుండి 27 వరకు వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్న ఏపీవివిపి కమీషనర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Bank Holiday-Dormant Accounts: వృద్ధుల ఖాతాల్లో పెన్షన్ సొమ్ములు పడతాయా..ఏపీలో Dormant ఖాతాలెన్నో లెక్కుందా!

AP Model School Marks: ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష మార్కులు విడుదల… ఆన్‌లైన్‌‌లో చెక్ చేసుకోండి ఇలా..

AP Summer Upadtes: ఆత్మకూరులో అదరగొట్టిన ఎండలు.. 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు, నేడు 61 మండలాలకు వార్నింగ్

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, మే నెలలో విశేష ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాసుపత్రులలో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ , స్పెషలిస్ట్ పోస్టుల్ని శాశ్వత / కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసేందుకు ఈ నెల 23 నుండి 27 వరకు వాక్-ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నట్టు ఎపివివిపి కమీషనర్ తెలిపారు. విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తారని తెలిపారు.

ఈ నెల 23 న జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, డెర్మటాలజీ స్పెషాలిటీస్ విభాగాల్లో నియామకాలు చేపడతారు. 25న గైనకాలజీ, ఇఎన్. టి, అనస్థీషియా,పాథాలజీ స్పెషాలిటీలకు, 27న పెడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, అఫ్తాల్మొలజీ, రేడియాలజీ మరియు సైకియాట్రీ స్పెషాలిటీలకు వాక్-ఇన్ రిక్రూట్మెంట్ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆయా తేదీల్లో ధృవపత్రాలతో వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థులు పదో తరగతి నుంచి ఎంబిబిఎస్‌ వరకు విద్యార్హత పత్రాలు, పీజీ డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికెట్స్ ,మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పీజీ మార్కుల లిస్టు, సోషల్ స్టేటస్ సర్టిఫికెట్, 4వ తరగతి నుండి 10 వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు.

వైద్య విధాన పరిషత్‌లో ఉద్యోగాల నియామకాలలో మరిన్ని వివరాల కోసం www.hmfw.ap.gov.in అనే వెబ్ సైట్ ను చూడాలని, ఏదైనా ఇతర సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే 06301138782 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు.

టాపిక్