తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bhuma Akhila Priya Followers Attacked Av Subbareddy During Nandyala Padayatra

Bhuma Akhila Arrest: పాదయాత్రలో పాతకక్షలు.. ఏవి సుబ్బారెడ్డిపై భూమా వర్గం దాడి..అఖిలప్రియ అరెస్ట్

HT Telugu Desk HT Telugu

17 May 2023, 8:35 IST

    • Bhuma Akhila Arrest: టీడీపీ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రలో పాతకక్షలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి అఖిల ప్రియ వర్గీయులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఆళ్ళగడ్డలో అఖిలప్రియకు ఏవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలతో నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. దీంతో అఖిలప్రియను అరెస్ట్ చేశారు. 
నంధ్యాలలో టీడీపీ నాయకుల బాహాబాహీ
నంధ్యాలలో టీడీపీ నాయకుల బాహాబాహీ

నంధ్యాలలో టీడీపీ నాయకుల బాహాబాహీ

Bhuma Vs AV: టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీ నాయకులు రోడ్డున పడి కొట్టుకున్నారు. నంద్యాల జిల్లాలో పాదయాత్ర జరుగుతుండగా రెండు వర్గాల మధ‌్య తలెత్తిన ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఆస్తుల వివాదం నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డికి అఖిల ప్రియ వర్గానికి మధ్య గత కొన్నాళ్లుగా రగడ నడుస్తోంది. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి గాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

AU MBA Admissions : ఆంధ్ర యూనివర్సిటీలో ఆన్ లైన్ ఎంబీఏ కోర్సులు, ఇలా దరఖాస్తు చేసుకోండి!

VJA Doctor Family: విజయవాడ డాక్టర్ ఫ్యామిలీలో దారుణం, కుటుంబ సభ్యుల్ని హత్య చేసి డాక్టర్ ఆత్మహత్య…

Bank Holiday-Dormant Accounts: వృద్ధుల ఖాతాల్లో పెన్షన్ సొమ్ములు పడతాయా..ఏపీలో Dormant ఖాతాలెన్నో లెక్కుందా!

AP Model School Marks: ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష మార్కులు విడుదల… ఆన్‌లైన్‌‌లో చెక్ చేసుకోండి ఇలా..

లోకేష్ యువగళం పాదయాత్రలో బలాన్ని నిరూపించుకునేందుకు తమపై దాడి చేశారని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నంద్యాల నియోజకవర్గంలో యాత్ర ప్రారంభం కాగానే పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డి తన అనుచరులతో పాల్గొనే ప్రయత్నం చేశారు.

అంతకుముందే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ యాత్రలో పాల్గొంటున్నారు. నారా లోకేష్‌తో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. లోకేష్‌‌తో కలిసి నడిచే క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. పరస్పర వాగ్వాదం కాస్త క్షణాల్లో తన్నులాటగా మారింది. నారా లోకేష్ ఎదుటే భూమా, ఏవి అనుచరులు పరస్పర దాడులకు దిగారు.

ఒకరిపై ఒకరి పిడుగులు గుద్దుకున్నారు. ఏవి సుబ్బారెడ్డి పై అఖిలప్రియ అనుచరులు దాడికి దిగారు, సుబ్బారెడ్డిని రోడ్డుపై పారేసి కాళ్లతో తన్నడం కనిపించింది. ఈ క్రమంలో ఏవి అనుచరులు కూడా అఖిలప్రియ అనుచరులపై దాడికి దిగడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను చదరగొట్టి అదుపులోకి తెచ్చారు. సంఘటన అనంతరం పాదయాత్ర నుండి నేరుగా పట్టణ తాలూకా పోలీస్ స్టేషన్ లో ఏవి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు.

నంద్యాలలో సుబ్బారెడ్డిపై దాడి నేపథ్యంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ చేశారు. అఖిల ప్రియను నంద్యాల పీఎస్ కు తరలించారు. ఏవీ సుబ్బారెడ్డిపై అనుచరులతో దాడి చేయించారంటూ అఖిలప్రియపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.