తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap High Court Punishment To Two All India Service Officers For Not Implementing Court Orders

High Court Punishment : అధికారులకు జైలు శిక్ష… సస్పెండ్ చేసిన ఎగువ కోర్టు…

HT Telugu Desk HT Telugu

18 January 2023, 15:03 IST

    • High Court Punishment హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయని ఇద్దరు ఉన్నతాధికారులకు ఏపీ హైకోర్టు జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది.  అధికారులు కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో రోజంతా కోర్టులో నిలబడాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం వెంటనే డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. కోర్టుకు క్షమాపణలు తెలిపినా  శిక్ష విధించడంతో ఉపశమనం కోరుతూ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు.  దీంతో  ఆలిండియా సర్వీస్ అధికారులకు విధించి
ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఏపీ హైకోర్టు కీలక తీర్పు

High Court Punishment కోర్టు ఉత్తర్వులను అమలు చేయని ఇద్దరు అధికారులకు ఏపీ హైకోర్టు జరిమానాతో పాటు జైలు శిక్షను విధించడం కలకలం రేపింది. పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌తో పాటు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్‌లకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించడంతో అధికారులు ఖంగుతిన్నారు. హుటాహుటిన కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో రోజంతా జైల్లో నిలబడాలని తీర్పును సవరించడంతో అధికారులు కోర్టు హాల్లో నిలబడ్డారు.

హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఇద్దరు ఉన్నతాధికారులకు ఏపీ హైకోర్టు జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది. వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఎస్పీఎఫ్‌ సిబ్బందిని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది.

సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఐఏఎస్‌ అధికారి బుడితి రాజశేఖర్‌, ఐఆర్‌ఎస్‌ రామకృష్ణకు నెల రోజుల జైలుశిక్షతో పాటు రూ. 2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వీరిద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. వారిని తుళ్లూరు పోలీసులకు అప్పగించాలని సూచించింది. గతంలో ఉన్నత విద్యాశాఖలో కార్యదర్శిగా రాజశేఖర్‌, ఇంటర్‌ బోర్డు కమిషనర్‌గా రామకృష్ణ పనిచేశారు. హైకోర్టు తీర్పుతో ఖంగుతిన్న అధికారులు న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు.

క్షమాపణలు కోరడంతో ఇద్దరు విద్యాశాఖ అధికారులకు రాష్ట్ర హైకోర్టు విధించిన జైలు శిక్షను ఉన్నత న్యాయస్థానం సవరించింది. కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌, ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ రామకృష్ణకు నెల రోజుల పాటు జైలు శిక్ష, రెండు వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు మొదట తీర్పు ఇచ్చింది. ఇద్దరు అధికారులు హైకోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పడంతో జైలు శిక్షను రద్దు చేసింది.

జైలు శిక్షకు బదులుగా సాయంత్రం వరకు కోర్టులోనే నిలబడాలని ఆదేశాలు జారీ చేసింది. సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో గతంలో ఇచ్చిన హైకోర్టు తీర్పును అమలు చేయని నేపథ్యంలో శిక్ష విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. మరోవైపు హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డివిజన్‌ బెంచ్‌లో సవాలు చేసింది. దీంతో దిగువ కోర్టు తీర్పును డివిజన్ బెంచ్‌ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.