తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Ys Jagan : చేయాల్సింది చేశా.. ఇవ్వాల్సింది ఇచ్చా.. ఎమ్మెల్సీ అభ్యర్థులతో సీఎం జగన్ !

CM YS Jagan : చేయాల్సింది చేశా.. ఇవ్వాల్సింది ఇచ్చా.. ఎమ్మెల్సీ అభ్యర్థులతో సీఎం జగన్ !

HT Telugu Desk HT Telugu

20 February 2023, 17:49 IST

    • CM YS Jagan : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. 18 మందితో క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన ముఖ్యమంత్రి... చేయాల్సింది చేశానని, ఇవ్వాల్సింది ఇచ్చానని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ చేస్తున్న సామాజిక న్యాయం ప్రతి గడపకూ తెలియాలని... ప్రతి నియోజకవర్గంలో చెప్పాలని నిర్దేశించారు. 
ఏపీ సీఎం వైఎస్ జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్

CM YS Jagan : వైయస్సార్‌సీపీ (YSRCP) తరఫున స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC) అభ్యర్థులు... గవర్నర్‌ కోటాలో ప్రతిపాదిత ఎమ్మెల్సీ అభ్యర్థులతో ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయం చేస్తున్నామని.. దేవుడి దయతో మన పార్టీలో అన్ని వర్గాలకు న్యాయం చేయగలుగుతున్నామని అన్నారు. ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోగలమన్నారు. పార్టీ తరపున 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశామన్న జగన్... ఇందులో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన వారే ఉన్నారన్నారు. మిగిలిన వారికి 4 సీట్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కో సీటు కేటాయించామని... వైఎస్సార్సీపీ చేస్తున్న సామాజిక న్యాయం ప్రతి గడపకూ తెలియాలని... ప్రతి నియోజకవర్గంలో చెప్పాలని నిర్దేశించారు. పార్టీ విధానాలను, ప్రభుత్వ పరంగా సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

సంక్షేమ, అభివృద్ధి, సామాజిక న్యాయ పరంగా ఇంత గొప్ప మార్పు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు సీఎం జగన్. పూర్తి పారదర్శకంగా బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారులకు లంచాలకు తావులేకుండా పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో మంచి మార్పులు తెచ్చామని... ఇవన్నీ ఒక ఎత్తు అయితే... ఈ రోజు చేసింది మరో ఎత్తు అని పేర్కొన్నారు. పదవులు తీసుకున్న వారు క్రీయాశీలకంగా పనిచేయాలని.. ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని అన్నారు. ఎమ్మెల్సీలుగా బాధ్యతలు తీసుకుంటున్న వారు.. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. తాను చేయాల్సింది చేశానని.. ఇవ్వాల్సింది ఇచ్చానన్న జగన్... పదవులు పొందిన వారు పార్టీ పరంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. పార్టీ తరపున ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు సీఎం జగన్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

పదవులు ఆశించిన వారు ఇంకా చాలా మంది ఉన్నారని... ఉన్న పదువులు తక్కువ కాబట్టి.. అందర్నీ సంతృప్తి పరచలేమని జగన్ పేర్కొన్నారు. ఆశావహులందరికీ పరిస్థితిని వివరించి... కలుపుకుపోవాలని చెప్పారు. ఈ సారి వడ్డీలకు, వడ్డెరలతో పాటు అనేక కులాలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చామని... మిగిలిన కులాలకు తదుపరి దఫాలో తప్పకుండా ఇస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175.. వై నాట్‌ అన్నరీతిలో వైఎస్సార్సీపీ పరిపాలన కొనసాగుతోందన్నారు. గత ఎన్నికల్లో మెజార్టీ కంటే.. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలు సాధిస్తామని ముఖ్యమంత్రి జగన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత మేలు చేస్తామని స్పష్టం చేశారు.