తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Departmental Tests : ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంట‌ల్ టెస్ట్ షెడ్యూల్ విడుద‌ల‌, జులై 28 నుంచి ఆగ‌స్టు 2 వ‌ర‌కు పరీక్ష

APPSC Departmental Tests : ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంట‌ల్ టెస్ట్ షెడ్యూల్ విడుద‌ల‌, జులై 28 నుంచి ఆగ‌స్టు 2 వ‌ర‌కు పరీక్ష

HT Telugu Desk HT Telugu

06 July 2024, 15:56 IST

google News
    • APPSC Departmental Tests : ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంట‌ల్ టెస్ట్ షెడ్యూల్ విడుద‌లైంది. జులై 28 నుంచి ఆగ‌స్టు 2 వ‌ర‌కు వివిధ టెస్టులు నిర్వహించనున్నారు. వివిధ పోస్టుల్లో ఎంపికైన వారికి జులై 12 నుంచి స‌ర్టిఫికేట్ల ప‌రిశీల‌న‌ ఉంటుంది.
ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంట‌ల్ టెస్ట్ షెడ్యూల్ విడుద‌ల‌
ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంట‌ల్ టెస్ట్ షెడ్యూల్ విడుద‌ల‌

ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంట‌ల్ టెస్ట్ షెడ్యూల్ విడుద‌ల‌

APPSC Departmental Tests : ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) వివిధ‌ విభాగాల ఉద్యోగుల‌కు నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్ట్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. జులై 28 నుంచి ఆగ‌స్టు 2 వ‌ర‌కు టెస్టుల‌ను నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఏ రోజు ఏ టెస్ట్ జ‌రుగుతుందో అనే వివ‌రాలు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయి. జులై 28 నుంచి ఆగ‌స్టు 2 వ‌ర‌కు ఏ రోజు, ఏ స‌మ‌యానికి, ఏ ప‌రీక్ష ఉంటుందో ఏపీపీఎస్సీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది.

వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల‌కు డిపార్ట్‌మెంటల్ టెస్ట్ నిర్వహిస్తున్నామ‌ని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన‌ట్లు పేర్కొన్నారు. పూర్తి వివ‌రాలు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయ‌ని, ఉద్యోగులు వెబ్‌సైట్‌ను చూడాల‌ని సూచించారు. అలాగే మెడిక‌ల్ ఆఫీస‌ర్లు (ఆయుర్వేదం, హోమియోప‌తి), ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్లు, శాంపిల్ టేక‌ర్‌, హోమియోప‌తి విభాగంలో లెక్చర‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు ఎంపికైన అభ్యర్థుల స‌ర్టిఫికేట్ల ప‌రిశీల‌న ఈ నెల 12 నుంచి ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు.

ఎంపికైన అభ్యర్థుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు ప‌రిశీల‌న‌

ఆంధ్రప్రదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లోని ప్రజా ఆరోగ్య విభాగంలో శాంపిల్ టేక‌ర్ పోస్టుల‌కు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీక‌ర‌ణ ప్రతాలు ప‌రిశీలిస్తున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడిస్తుంది. అభ్యర్థులు త‌మ ఒరిజిన‌ల్ స‌ర్టిఫికేట్లతో జులై 12న ఉద‌యం విజ‌య‌వాడ‌లోని ఏపీపీఎస్సీ కార్యాల‌యానికి రావాల‌ని కోరింది. శాంపిల్ టేక‌ర్ పోస్టుల‌కు ఎంపికైన న‌లుగురు అభ్యర్థుల జాబితాతో కూడిన డైరెక్ట్ లింక్‌. https://psc.ap.gov.in/Documents/RESULTS/112022_PC01_04072024/SampleTakerRESULTNOTIFICATION.pdf .

అలాగే హోమియోప‌తి విభాగంలో లెక్చర‌ర్, అసిస్టెంట్‌ ప్రొఫెస‌ర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి కూడా జులై 12నే ధ్ర‌వీక‌ర‌ణ ప‌త్రాలు ప‌రిశీలిస్తారు. ఎంపికైన అభ్య‌ర్థుల జాబితాకు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://psc.ap.gov.in/Documents/RESULTS/1521_1522_050724/RESULTNOTIFICATION.pdf .

అలాగే హోమియోప‌తి విభాగంలో మెడిక‌ల్ ఆఫీస‌ర్లగా ఎంపికైన 51 మంది అభ్యర్థులు, ఆయుర్వేదం విభాగంలో మెడిక‌ల్ ఆఫీస‌ర్లగా ఎంపికైన 65 మంది అభ్యర్థుల‌ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల ప‌రిశీలిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. జులై 23 నుంచి 25 వ‌ర‌కు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు పరిశీలిస్తారు. అభ్యర్థులు త‌మ ఒరిజిన‌ల్ స‌ర్టిఫికేట్లు ప‌ట్టుకుని విజ‌య‌వాడ‌లోని ఏపీపీఎస్ కార్యాల‌యంలో జ‌రిగే ధ్రువీక‌రణ పత్రాల ప‌రిశీల‌న‌కు హాజ‌రుకావాలి. హోమియోప‌తి విభాగంలో మెడిక‌ల్ ఆఫీస‌ర్లగా ఎంపికైన 51 మంది అభ్యర్థుల జాబితా డైరెక్ట్ లింక్‌ https://psc.ap.gov.in/Documents/RESULTS/0921_1722/ResultNotification.pdf . అలాగే ఆయుర్వేదం విభాగంలో మెడిక‌ల్ ఆఫీస‌ర్లగా ఎంపికైన 65 మంది అభ్యర్థుల జాబితా డైరెక్ట్ లింక్‌ https://psc.ap.gov.in/Documents/RESULTS/0821_1622/ResultNotification.pdf .

మ‌రోవైపు రాష్ట్ర అట‌వీశాఖ‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ (ఎఫ్ఆర్‌వో) పోస్టుల‌కు ఎంపికైన అభ్యర్థుల వివ‌రాల‌ను ఏపీపీఎస్సీ విడుద‌ల చేసింది. వివ‌రాల‌ను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. జోన్ 1 నుంచి ఇద్దరు, జోన్ 2 నుంచి ఒక‌రు, జోన్ 3 నుంచి ముగ్గురు, జోన్ 4 నుంచి ఒక‌రు ఎంపిక అయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాకు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/SelectionNotification_2122_040724.pdf . దీనిపై క్లిక్ చేస్తే వెంట‌నే ఎంపికైన అభ్యర్థుల జాబితా జోన్‌ల వారీగా వెలువ‌డుతుంది.

ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల ప‌రిశీల‌ను తీసుకెళ్లాల్సిన జాబితా

ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా, వ‌య‌స్సు స‌డ‌లింపునకు ఆధార స‌ర్టిఫికేట్‌, విద్యా అర్హత‌లు స‌ర్టిఫికేట్లు, ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు స్టడీ స‌ర్టిఫికేట్లు, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, బీసీలైతే నాన్ క్రిమిలేయ‌ర్ స‌ర్టిఫికేట్‌, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మైగ్రేట్ అయితే మైగ్రేష‌న్ స‌ర్టిఫికేట్లతో అభ్యర్థులు త‌మ‌కు కేటాయించిన తేదీల్లో విజ‌య‌వాడ‌లోని ఏపీపీఎస్‌సీ కార్యాల‌యానికి వెళ్లాలి.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం