EPFO alert : ఈ ఈపీఎస్ కొత్త రూల్‌తో 23లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం!
EPS new rule : ఈపీఎఫ్ నుంచి అలర్ట్! ఈపీఎస్ పథకానికి సంబంధించి కీలక రూల్‌ని సవరించారు. ఫలితంగా 23 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఆ వివరాలు..
ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్స్‌కి అలర్ట్! ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)-1995ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఫలితంగా ఆరు నెలల కంటే తక్కువ సర్వీసు ఉన్న ఉద్యోగులకు ఇప్పుడు విత్‌డ్రా బెనిఫిట్స్ లభిస్తున్నాయి.
ఆరు నెలల కంటే తక్కువ కాంట్రిబ్యూటరీ సర్వీసుతో ఈ పథకాన్ని విడిచిపెట్టిన 7 లక్షల మందికి పైగా ఈపీఎస్ సభ్యులకు ఈ సవరణ ప్రయోజనం చేకూరుస్తుందని ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రతి నెల సర్వీస్‌ని పరిగణనలోకి తీసుకొని, అందించిన సర్వీస్‌కి ఉపసంహరణ ప్రయోజనాలు ఇచ్చేలా కేంద్రం టేబుల్ డీని సవరించింది. పథకం అర్హతకు అవసరమైన సేవలను అందించని సభ్యులు లేదా 58 సంవత్సరాలు నిండిన సభ్యులను ఈ టేబుల్ డీ సూచిస్తుంది.
ఉపసంహరించుకునే మొత్తం ఇప్పుడు ఒక సభ్యుడు సర్వీస్‌ని పూర్తి చేసిన నెలలు, ఈపీఎస్ కంట్రిబ్యూషన్ అందుకున్న వేతనాలపై ఆధారపడి ఉంటుంది.
ఇంతకు ముందు వరకు.. పూర్తయిన సంవత్సరాల్లో కంట్రిబ్యూటరీ సర్వీస్ వ్యవధి, ఈపీఎస్ కంట్రిబ్యూషన్ చెల్లించిన వేతనాల ఆధారంగా ఉపసంహరణ ప్రయోజనాన్ని లెక్కించడం జరిగేది. ఇందులో తప్పనిసరిగా ఆరు నెలల కంట్రిబ్యూటరీ సర్వీస్ కూడా ఉంది. అందువల్ల, ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ కంట్రిబ్యూటరీ సర్వీస్ పూర్తయిన తరువాతే, సభ్యులకు ప్రయోజనాలు ఇవ్వడం జరిగేది. ఆరు నెలలకు ముందు ఈ పథకం నుంచి వైదొలిగిన సభ్యులు ఈ ప్రయోజనాలకు అర్హత పొందేవారు కాదు.
సభ్యులు ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కంట్రిబ్యూటరీ సర్వీస్ పూర్తి చేసిన తరువాత ఉపసంహరణ ప్రయోజనానికి అర్హులు! ఈ కారణంగానే తప్పనిసరి సేవను అందించడానికి ముందు సభ్యులు నిష్క్రమించడానికి అనేక క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, కంట్రిబ్యూటరీ సర్వీస్ ఆరు నెలల కంటే తక్కువ ఉన్నందున ఉపసంహరణ ప్రయోజనాల కోసం సుమారు 7 లక్షల క్లెయిమ్లు తిరస్కరణకు గురైనట్టు నివేదికలు చెబుతున్నాయి.
టేబుల్ డీని సవరించడం, చెల్లింపు వ్యవస్థను సరళతరం చేయడం వల్ల ఈ పథకం కింద 23 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఇంతకు ముందు వరకు.. ఆరు నెలల వ్యవధిని టేబుల్ డీ పరిగణలోకి తీసుకునేది కాదు. అందుకే చాలా తక్కువ మంది విత్‌డ్రాలు చేసుకునేవారు. ఈ సమస్యలకు ఇప్పుడు పరిష్కారం దొరికింది!
ప్రభుత్వ ప్రకటన ప్రకారం, పెన్షన్ కోసం తప్పనిసరిగా పదేళ్ల కాంట్రిబ్యూటరీ సర్వీస్ అందించడానికి ముందు ప్రతి సంవత్సరం 95 లక్షల మందికి పైగా ఈపీఎస్ సభ్యులు ఈ పథకాన్ని విడిచిపెడతారు. అలాంటి ఉద్యోగులకు ఎంప్లాయీ ప్రావిడెంట్ స్కీమ్ ప్రకారం విత్‌డ్రా బెనిఫిట్స్ ఇస్తారు.
2023-24 ఆర్థిక ఏడాదిలో 30లక్షలకుపైగా విత్‌డ్రా క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు నివేదికలు చెబుతున్నాయి.
వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగుల కోసం 1995లో ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్‌ని ప్రవేశపెట్టారు. ఎంప్లాయీ ప్రావిడెంట్ పథకానికి అర్హులైన ఉద్యోగులు కూడా పెన్షన్ పథకానికి అర్హులే! కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిర్వహించే ఈ ఫండ్‌కి యజమాని, ఉద్యోగి ఇద్దరూ కంట్రిబ్యూషన్ చేస్తారు.
సంబంధిత కథనం