వందేభారత్ రైలు భోజనంలో బొద్దింక.. సర్వీస్ ప్రొవైడర్‌కు ఐఆర్‌సీటీసీ జరిమానా-vande bharat passengers claim finding dead cockroach in meal irctc responds ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  వందేభారత్ రైలు భోజనంలో బొద్దింక.. సర్వీస్ ప్రొవైడర్‌కు ఐఆర్‌సీటీసీ జరిమానా

వందేభారత్ రైలు భోజనంలో బొద్దింక.. సర్వీస్ ప్రొవైడర్‌కు ఐఆర్‌సీటీసీ జరిమానా

HT Telugu Desk HT Telugu
Jun 20, 2024 06:01 PM IST

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వడ్డించిన భోజనంలో బొద్దింక ఉందని ఎక్స్(ట్విటర్) లో చేసిన ఫిర్యాదుపై ఐఆర్సీటీసీ స్పందించింది.

ఆహారంలో బొద్దింక ఉన్న విషయాన్ని చూపుతున్న ప్రయాణికులు
ఆహారంలో బొద్దింక ఉన్న విషయాన్ని చూపుతున్న ప్రయాణికులు (X/@ViditVarshney1)

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు వడ్డించిన ఆహారంలో చనిపోయిన బొద్దింక ఉన్న చిత్రాన్ని ఎక్స్ (ట్విటర్) యూజర్ విదిత్ వర్షిణే షేర్ చేశారు. జూన్ 18న భోపాల్ నుంచి ఆగ్రాకు వెళ్లిన తన మేనమామ, అత్తకు ఈ సంఘటన ఎదురైందని ఆయన పేర్కొన్నారు. భోజన సౌకర్యాన్ని అందించిన సదరు వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విదిత్ వర్షిణే అధికారులను కోరారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) అతని పోస్ట్‌కు స్పందించి అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. సర్వీస్ ప్రొవైడర్లకు తగిన జరిమానా విధించినట్లు వారు పేర్కొన్నారు.

"ఈ రోజు మా మామ, అత్త వందేభారత్ లో భోపాల్ నుండి ఆగ్రాకు ప్రయాణిస్తున్నారు. ఐఆర్సీటీసీ పంపిణీ చేసిన ఆహారంలో బొద్దింక వచ్చింది. దయచేసి విక్రేతపై కఠిన చర్యలు తీసుకోండి. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోండి" అని విదిత్ బొద్దింకతో ఉన్న ఆహారం యొక్క చిత్రాన్ని షేర్ చేశారు. ఆ ఫొటోను మీరూ ఓ లుక్కేయండి.

రైలు ప్రయాణీకుల కోసం ఎక్స్‌లో అధికారిక హ్యాండిల్ అయిన రైల్వేసేవ, తన “పిఎన్ఆర్ నంబర్, మొబైల్ నంబర్”ను పంచుకోవాలని అభ్యర్థించింది. తన అత్త, మామ ఎదుర్కొన్న అనుభవానికి విచారం వ్యక్తం చేసింది.

ఎక్స్‌లో పోస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత, ఐఆర్సిటిసీ అధికారిక హ్యాండిల్ స్పందించింది. 'సర్, మీ ప్రయాణ అనుభవానికి మేము క్షమాపణలు కోరుతున్నాం. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌కు తగిన జరిమానా విధించాం. ఉత్పత్తి, లాజిస్టిక్స్ పర్యవేక్షణను కూడా ముమ్మరం చేశాం..’ అని పేర్కొంది.

నెటిజన్ల స్పందన

"ఆహారం తయారు చేసే క్యాంటీన్ పరిస్థితిని ప్రయాణికులు చూస్తే, చాలా మంది ఎప్పుడూ ఆర్డర్ చేయరు. వీలైనప్పుడల్లా ఇంట్లో వండిన భోజనాన్ని తీసుకురావడానికి నేను ఇష్టపడతాను" అని నితీష్ కుమార్ అనే ఎక్స్ యూజర్ పేర్కొన్నారు.

ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడల్లా రైల్వే వివరాలు మాత్రమే అడుగుతుందని, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని మరొకరు పేర్కొన్నారు. ఆహార నాణ్యత మాత్రమే కాదు, ప్యాంట్రీలో అధిక ఛార్జీలు కూడా వసూలు చేస్తారు, ఈ విషయం అధికారులకు బాగా తెలిసినా కొన్ని 'ఇతర కారణాల వల్ల' చర్యలు తీసుకోవడం లేదని మరొకరు స్పందించారు.

'నేను రైల్వే ఫుడ్ తినను. మీ ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మీతో తీసుకెళ్లండి" అని మరో ఎక్స్ యూజర్ ఫిరోజ్ అహ్మద్ సూచించారు.

Whats_app_banner