IRCTC Tirumala Tour Package : తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం- రూ.3800లకే హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ప్యాకేజీ-irctc tirumala srivari darshan 3 days tour package from hyderabad details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Tirumala Tour Package : తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం- రూ.3800లకే హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ప్యాకేజీ

IRCTC Tirumala Tour Package : తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం- రూ.3800లకే హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ప్యాకేజీ

Jun 19, 2024, 01:44 PM IST Bandaru Satyaprasad
Jun 19, 2024, 01:43 PM , IST

  • IRCTC Tirumala Tour Package : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకుంది. అయితే ఐఆర్సీటీసీ అతి తక్కువ ధరలో సికింద్రాబాద్ నుంచి తిరుమల శ్రీవారి దర్శన ప్యాకేజీ అందిస్తోంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకుంది. అయితే ఐఆర్సీటీసీ అతి తక్కువ ధరలో సికింద్రాబాద్ నుంచి తిరుమల శ్రీవారి దర్శన ప్యాకేజీ అందిస్తోంది. 

(1 / 6)

ప్రయాణం ఇలా- గూడూరు జంక్షన్, లింగంపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, తిరుపతి, తిరుమల- మొత్తం 3 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ 

(2 / 6)

గోవిందం రైల్ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ. 3800.  ప్రతి రోజు సాయంత్రం 6.25 గంటలకు లింగంపల్లి నుంచి రైలు బయలుదేరుతుంది. స్లీపర్, 3ఏసీలో ప్రయాణం ఉంటుంది.

(3 / 6)

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్:క్లాస్                               -కంఫర్ట్ (3A)    - స్టాండర్ట్ (SL)                          సింగిల్ ఆక్యుపెన్సీ -    ₹ 6790/-     ₹ 4940/-        డబుల్ ఆక్యుపెన్సీ   -   ₹ 5660/-      ₹ 3800/- ట్రిపుల్ ఆక్యుపెన్సీ      - ₹ 5660/-  ₹ 3800/-           చైల్డ్ విత్ బెడ్  (5-11 సంవత్సరాలు)  - ₹ 4750/- ₹ 2890/-       చైల్డ్ వితవుట్ బెడ్ (5-11 సంవత్సరాలు) -    ₹ 4750/-   ₹ 2890/-                                                                                                        

(4 / 6)

ప్రయాణ వివరాలు ఇలా : డే 01 :  లింగంపల్లి నుంచి ఎక్స్ ప్రెస్( నెం. 12734) సాయంత్రం 6:25 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌లో 7:05 గంటలకు, నల్గొండ 8:35 గంటలకు ప్రయాణికుల బోర్డింగ్ ఉంటుంది. ఓవర్ నైట్ జర్నీ చేస్తారు. డే 02 : ఉదయం 06:55 గంటలకు తిరుపతి చేరుకుంటారు. స్టేషన్ లో పికప్ చేసుకుని హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్‌లో ఫ్రెషప్ అయ్యి అల్పాహారం చేస్తారు.  శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం ఉదయం 09:00 గంటలకు తిరుమలకు బయలుదేరతారు. దర్శనం అనంతరం సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్‌లో 6:20 గంటలకు ఎక్స్ ప్రెస్ రైలు (నెం. 12733)  ఎక్కాలి. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. డే 03 : నల్గొండకు తెల్లవారుజామున 03:04 గంటలకు, సికింద్రాబాద్‌కు 05:35 గంటలకు, లింగంపల్లికి 06:55 గంటలకు చేరుకుంటారు. 

(5 / 6)

భక్తులు తప్పనిసరి డ్రెస్ కోడ్ పాటించాలి. పురుషులు ధోతీ (తెలుపు), చొక్కా లేదా కుర్తా, పైజామా ధరించాలి. స్త్రీలు చీర లేదా సల్వార్ కమీజ్ (చున్నీ తప్పనిసరి) ధరించాలి. టీ-షర్ట్, జీన్స్ వంటి దుస్తులను ధరించకూడదు. వయస్సుతో సంబంధం లేకుండా దుస్తుల నియమం పాటించాలి. గోవిందం టూర్ ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాలకు ఈ లింక్ https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR084  లో తెలుసుకోవచ్చు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు