Good news for EPFO EPS members: ఈపీఎఫ్ఓ ఈపీఎస్ సభ్యులకు సువర్ణావకాశం-sc opens 4 month window for eligible employees under eps to opt for increased pension ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Good News For Epfo Eps Members: ఈపీఎఫ్ఓ ఈపీఎస్ సభ్యులకు సువర్ణావకాశం

Good news for EPFO EPS members: ఈపీఎఫ్ఓ ఈపీఎస్ సభ్యులకు సువర్ణావకాశం

HT Telugu Desk HT Telugu
Nov 08, 2022 05:45 PM IST

SC opens 4-month window for EPS to opt for increased pension: ఈపీఎస్ కింద ఎక్కువ పెన్షన్ కావాలనుకునే వారికి సుప్రీంకోర్టు మరో అవకాశం ఇచ్చింది. అర్హులైన ఉద్యోగులు ఇందులో చేరేందుకు 4 నెలల సమయం ఇచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

SC opens 4-month window for EPS to opt for increased pension: 2014 కన్నాముందు Employees' Pension (Amendment) Scheme, 2014 కన్నాముందు ఎక్కువ పెన్షన్ ఆప్షన్ ను ఎంచుకోనటువంటి అర్హత కలిగిన ఉద్యోగులకు ఇప్పుడు.. మరోసారి ఆ అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.

SC opens 4-month window for EPS to opt for increased pension: 4 నెలల గడువు

Employees' Pension (Amendment) Scheme, 2014 లో ఉన్న అర్హులైన ఉద్యోగులు ఎక్కువ పెన్షన్ కావాలనుకుంటే, యాజమాన్య సంస్థతో కలిసి నాలుగు నెలల్లోగా ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సెప్టెంబర్ 1, 2014 నాటికి EPS లో ఉన్న సభ్యులు తన వాస్తవ వేతనం('actual salary)లో నుంచి 8.33% మొత్తాన్ని ఈ స్కీమ్ కోసం కాంట్రిబ్యూట్ చేయవచ్చు. ఇప్పటివరకు నెలవారీ రూ. 15 వేల గరిష్ట వేతనం కలిగిన వారు తమ ‘పెన్షనబుల్ వేతనం(pensionable salary)’లో మాత్రమే 8.33 శాతం పెన్షన్ కోసం కాంట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంది.

SC opens 4-month window for EPS to opt for increased pension: రూ. 15 వేల నెలవారీ వేతనం

రూ. 15 వేల కన్నా నెలవారీ వేతనం ఎక్కువగా ఉన్నఉద్యోగులు తమ వేతనంలో 1.16% కంట్రిబ్యూట్ చేయాలన్న నిబంధనను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనివల్ల ఉద్యోగులు ఎక్కువ మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేయడానికి, తద్వారా ఎక్కువ పదవీవిరమణ ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి వీలుగా సాధ్యమైనంత త్వరగా EPFO central board of trustees సమావేశం నిర్వహించాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేశాయి.

SC opens 4-month window for EPS to opt for increased pension: మొదట చట్టంలో లేదు..

The Employees' Provident Funds and Miscellaneous Provisions Act, 1952 లో మొదట ఎలాంటి పెన్షన్ పథకానికి సంబంధించిన విషయాలేవీ లేవు. తరువాత, 1955లో ఒక సవరణ ద్వారా పెన్షన్ స్కీమ్ ను ప్రారంభించారు. దీనిద్వారా నెలవారీ గరిష్ట పెన్షనబుల్ వేతనం రూ. 5000 ఉన్న ఉద్యోగులు తమ వేతనంలో 8.33 శాతం కంట్రిబ్యూషన్ ప్రావిడెంట్ ఫండ్ లో జమ చేయాలి. ఆ నెలవారీ గరిష్ట పెన్షనబుల్ వేతనం రూ. 5000 నుంచి దశలవారీగా పెంచుతూ, ప్రస్తుతం రూ. 15 వేలకు చేర్చారు.

SC opens 4-month window for EPS to opt for increased pension: 2014 సవరణ

ఈ EPS కు 2014, ఆగస్ట్ 22న సవరణ చేశారు. ఈ సవరణ ప్రకారం, గరిష్ట పెన్షనబుల్ సాలరీని రూ. 15 వేలకు పెంచారు. అలాగే, ఉద్యోగులు, వారి యజమానులు ఉద్యోగుల వాస్తవ వేతనం(actual salaries)లో 8.33 శాతం ఈ ఫండ్ కు చెల్లించవచ్చు. అందరు EPS సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఆరు నెలల సమయం ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ తాజాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరో నాలుగు నెలల గడువు ఇచ్చారు.

IPL_Entry_Point