APPSC DEO Prelims Results : ఏపీపీఎస్సీ డీఈవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, మెయిన్స్ కు 3,957 మంది ఎంపిక
APPSC DEO Prelims Results : ఏపీపీఎస్సీ డీఈవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసింది. మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్ సైట్ లో ఉంచింది.
APPSC DEO Prelims Results : ఏపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఈవో) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని 38 డీఈవో పోస్టులకు మే 25 రాత పరీక్ష నిర్వహించారు. ఈ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు 1:1000 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. మొత్తం 3,957 మంది అభ్యర్థుల మెయిన్స్ కు అర్హత సాధించారు. మెరిట్ జాబితాను ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో https://portal-psc.ap.gov.in/ లో అందుబాటులో ఉంటారు.
తుది కీ విడుదల
రాష్ట్రంలోని 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు గత ఏడాది డిసెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 25న సీబీడీ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ www.psc.ap.gov.in విడుదల చేశారు. మెయిన్ పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ప్రైమరీ కీ వచ్చిన అభ్యంతరాలను నిపుణులతో చర్చించి తుది కీ ని విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఫైనల్ కీ కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఏపీపీఎస్సీ డీఈవో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
1. ఏపీపీఎస్సీ డీఈవో ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ పై క్లిక్ చేయండి.
2. హోమ్‌పేజీలో "ఏపీ డీఈవో ఫలితాల నోటిఫికేషన్" పై క్లిక్ చేయండి.
3. తర్వాత పేజీలో డీఈవో మెయిన్స్ అభ్యర్థులు జాబితాపై క్లిక్ చేయండి.
4. పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. Ctrl + F ఉపయోగించి మీ ఫలితాలు తెలుసుకోవచ్చు.
ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్) ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. ఏపీ ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్ఈ) పర్యవేక్షణలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) ఆధ్వర్యంలో జూన్ 9న జరిగిన ఏపీ లాసెట్, ఏపీపీజీఎల్‌సెట్ నిర్వహించారు. ఈ ఫలితాలను గురువారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏపీ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి.సత్యనారాయణ విడుదల చేశారు. లాసెట్‌ను 19,224 మంది అభ్యర్థులు రాశారు. అందులో 17,117 మంది (89.04 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో రెండేళ్ల పీజీ కోర్స్ లో 99.51 శాతం, మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 89.74 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 80.06 శాతం ఉతీర్ణత సాధించారు.
ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్) ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్ఈ) పర్యవేక్షణలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) ఆధ్వర్యంలో జూన్ 9న జరిగిన ఏపీ లాసెట్, ఏపీపీజీఎల్‌సెట్ నిర్వహించారు. ఈ ఫలితాలను గురువారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏపీ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి.సత్యనారాయణ విడుదల చేశారు. లాసెట్‌ను 19,224 మంది అభ్యర్థులు రాశారు. అందులో 17,117 మంది (89.04 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో రెండేళ్ల పీజీ కోర్స్ లో 99.51 శాతం, మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 89.74 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 80.06 శాతం ఉతీర్ణత సాధించారు.