TS LAWCET Results: రేపు టీఎస్ లాసెట్ ఫలితాలు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే
TS Lawcet Results 2023 Updates: రేపు టీఎస్ లాసెట్ 2023 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
TS LAWCET 2023 Result: తెలంగాణ లాసెట్ -2023 ప్రవేశ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. జూన్ 15వ తేదీన టీఎస్ లాసెట్, పీజీ ఎల్‌సెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేయనున్నారు. అభ్యర్థుల వారి ర్యాంక్ కార్డులను lawcet.tsche.ac.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి...
-అభ్యర్థులు మొదటగా lawcet.tsche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
-Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
-Hall Ticket Number, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
-గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
-ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
-అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.
టీఎస్ లాసెట్, పీజీ లాసెట్ ప్రవేశ పరీక్ష మే 25వ తేదీన మూడు సెషన్లలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చూస్తే... దాదాపు 30 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో చేరేందుకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక ఎల్ఎల్ బీ ఐదేళ్ల కోర్సులో చేరాలంటే ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఇక ఎల్ఎల్ ఎం చేయాలంటే... ఎల్ఎల్ బీ డిగ్రీ ఉండాలి. ఫలితాల అనంతరం... కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తారు. ర్యాంక్ ల ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు.
డీఈఈ సెట్- 2023 ఫలితాలు విడుదల
TS DEECET Results 2023: డైట్ కాలేజీల్లో ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వచ్చేశాయ్. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ మీడియం కాలేజీల వారీగా ఫలితాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన డీఈఈ సెట్ -2023 ఫలితాలను అధికారిక వెబ్ సైట్ deecet.cdse.telangana.gov.in లో చెక్ చేసుకోవచ్చని ప్రకటించారు.
-అభ్యర్థులు మొదటగా deecet.cdse.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
-Download Results and Ranks అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
-Hall Ticket Number ను ఎంట్రీ చేయాలి.
-గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
-ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
-అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.
ఈ ఏడాది నిర్వహించిన ప్రవేశ పరీక్షలో చూస్తే... తెలుగు మీడియంలో 75.91 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 84.72 శాతం, ఉర్దూ మీడియంలో 50.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. త్వరలోనే కౌన్సిలింగ్ తేదీలు ఖరారు చేయనున్నారు. డీఈఈసెట్ 2023 ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ డైట్ కాలేజీతోపాటు, ప్రైవేట్ డీఐఈడీ కాలేజీల్లోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.. ఇందుకోసం జూన్ 1వ తేదీన పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.