HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ వాయిదా, త్వరలో కొత్త తేదీ ప్రకటన

APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ వాయిదా, త్వరలో కొత్త తేదీ ప్రకటన

03 July 2024, 20:02 IST

    • APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ వాయిదా పడింది. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా, త్వరలో కొత్త తేదీ ప్రకటన
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా, త్వరలో కొత్త తేదీ ప్రకటన

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా, త్వరలో కొత్త తేదీ ప్రకటన

APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై కీలక ప్రకటన చేసింది. జులై 28 నుంచి నిర్వహించాల్సిన గ్రూప్-2 మెయిన్స్ ను వాయిదా వేసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ బుధవారం ఓ ప్రకటన చేసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహించగా, ఏప్రిల్ 10న ఫలితాలు వెలువడ్డాయి.

ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను ఫిబ్రవరి 25న నిర్వహించారు. ఈ ఫలితాలను ఏపీపీఎస్సీ ఏప్రిల్ 10న ప్రకటించింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రకటించింది. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 899 గ్రూప్-2 పోస్టులకు ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షా విధానం

గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. అయితే తాజాగా అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో మెయిన్స్ వాయిదా వేసింది. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయిస్తారు.

ఏపీ డీఎస్సీ, టెట్ పరీక్షలకు 90 రోజుల సమయం

ఏపీ మెగా డీఎస్సీ, టెట్ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో టెట్ కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే డీఎస్సీ, టెట్ కొత్త తేదీలు ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే మొత్తం ప్రక్రియ 6 నెలల్లోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఈ ఏడాది బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారికి మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీకి అనుగుణంగా మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. టెట్‌, మెగా డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు మరింత సమయం కావాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు, పలువురు ఎమ్మెల్సీలు మంత్రి లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై మంత్రి లోకేశ్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. మంత్రి లోకేశ్ ఆదేశాలతో టెట్‌కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్