APPSC Group 2 : ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్-పరీక్ష కేంద్రాలు, పోస్టుల ప్రాధాన్యత మార్పునకు ఎడిట్ ఆప్షన్
19 June 2024, 14:51 IST
- APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ దరఖాస్తుల్లో మార్పులకు కమిషన్ అవకాశం కల్పించింది. పరీక్ష కేంద్రాలు, పోస్టులు, జోన్ల ప్రాధాన్యత మార్చుకునేందుకు ఈ నెల 25 వరకు అవకాశం కల్పించింది.
ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- పరీక్ష కేంద్రాల మార్పునకు అవకాశం
APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్-2 మెయిన్స్ దరఖాస్తులో పోస్టుల ప్రాధాన్యత, పరీక్ష కేంద్రం ప్రాధాన్యతలను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. పోస్టుల ప్రాధాన్యత, పరీక్ష కేంద్రాల మార్పులు, జోన్ల ప్రధాన్యత మార్చుకునేందుకు ఈ నెల 25వ తేదీ రాత్రి 11.59 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఒకసారి ఎడిట్ చేసిన సబ్మిట్ చేస్తే మార్చుకోవడానికి ఇక అవకాశం ఉందని స్పష్టం చేసింది. అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని అధికారులు తెలిపారు. ఇదే చివరి అవకాశమని ఇకపై సవరణలకు అవకాశం ఉందని పేర్కొంది.
92 వేల మంది గ్రూప్-2 మెయిన్స్ కు క్వాలిఫై
ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మెయిన్స్ కు క్వాలి ఫై అయిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో ఉన్నాయి. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ (APPSC)తెలిపింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షా విధానం
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను జులై 28న నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు. మొత్తం 899 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
టీజీపీఎస్సీ ఉద్యోగాలకు పరీక్షల షెడ్యూల్
టీజీపీఎస్సీ నిర్వహించే పలు పరీక్షలకు తేదీలు ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటన చేశారు. గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాల పరీక్షల తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. జూన్ 24 నుంచి 29 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షలకు 3 రోజుల ముందుగా హాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, గిరిజన సంక్షేమ శాఖలో గ్రేడ్-I, గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్ సంక్షేమ అధికారి గ్రేడ్-II, షెడ్యూల్డ్ కులాభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖ, వార్డెన్ గ్రేడ్-I, గ్రేడ్-II, మాట్రాన్ గ్రేడ్-I, గ్రేడ్-II, వికలాంగులు & సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డైరెక్టర్, లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్‌లో పోస్టులు, మహిళా శిశు సంక్షేమ శాఖ జనరల్ రిక్రూట్‌మెంట్ ఖాళీలకు మల్టీషిఫ్ట్‌లలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ విధానంలో నిర్వహించనున్నారు.
షెడ్యూల్ ఇలా ?
- 24-06-2024 నుంచి 28-06-2024
ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు - Paper I జనరల్ స్టడీస్
- 24-06-2024 నుంచి 28-06-2024
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు - Paper II ఎడ్యుకేషన్ ( బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ లెవల్)
- 29-06-2024
ఉదయం 10 AM నుంచి 12:30 PM - Paper I జనరల్ స్టడీస్
మధ్యాహ్నం 2:30 నుంచి 5 PM వరకు - Paper II - ఎడ్యుకేషన్ ( బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ లెవల్)
మధ్యాహ్నం 2:30 నుంచి 5 PM వరకు - Paper II -డిప్లొమా ఇన్ స్పెషన్ ఎడ్యుకేషన్ (Visual Impairment)
మధ్యాహ్నం 2:30 నుంచి 5 PM వరకు - Paper II - డిప్లొమా ఇన్ స్పెషన్ ఎడ్యుకేషన్(Hearing Impairment)