AP EdCET Halltickets: ఏపీ ఎడ్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల, ఆన్‌లైన్‌లో డౌన్ లోడ్ చేసుకోవడం ఇలా..
AP EdCET Halltickets: ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 8న ఏపి ఎడ్ సెట్ 2024 ప్రవేశ పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన హాల్ టిక్కెట్లును విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP EdCET Halltickets: ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 8న ఏపి ఎడ్ సెట్ 2024 ప్రవేశ పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన హాల్ టిక్కెట్లును విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎడ్ సెట్ ద్వారా ఉపాధ్యాయ విద్యా (బీఈడీ)లో ప్రవేశాలు ఉంటాయి.
ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ లో ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షను ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహిస్తుంది. ఎడ్ సెట్ ద్వారా రెండేళ్ల బీఈడీ కోర్సులతో పాటు, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. బీఈడీ ప్రవేశ పరీక్షను జూన్ 8న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ 'కీ' ని జూన్ 15న విడుదల చేస్తారు. జూన్ 18 వరకు ప్రిలిమినరీ 'కీ'పై అభ్యంతరాలు స్వీకరిస్తారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా పరీక్షా కేంద్రాల జాబితాను ఏపి ఎడ్ సెట్ సమాచార బుక్ లెట్ లో పేర్కొన్నారు.
డిగ్రీ పూర్తి చేసినవారే ఎడ్ సెట్ పరీక్ష రాయడానికి అర్హులు. బీఏ, బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ హోమ్ సైన్స్, బీబీఏం, బీఈ, బీటెక్ పూర్తి చేస్తున్నవారు. అలాగే ఆయా కోర్సుల్లో ఫైబల్ ఇయర్ పరీక్షలు రాసిన వారు అర్హులు. అలాగే ఆయా కోర్సుల్లో విద్యార్థులకు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని గ్రూపులు, వికలాంగులకు కనీసం 40 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. బీఈ, బీటెక్ కోర్సులు చేసిన విద్యార్థులు మ్యాథ్స్ మెథాడాలజీలో ప్రవేశం కోసం కనీసం మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే అడ్మిషన్ సమయానికి మార్కుల జాబితాలను సమర్పించాల్సి ఉంటుంది.
బీఈడీ ప్రవేశ పరీక్ష ఎలా ఉంటుంది?
ఎడ్ సెట్ -2024 ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ లో ఉంటుంది. ఈ పరీక్షలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. రెండు గంటల పాటు ఉండే ఈ పరీక్షలిఒ 150 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ ఏలో 25 మార్కులకు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. పార్ట్ బీలో 15 మార్కులకు జనరల్ నాలెడ్జ్, పది మార్కలకు టీచింగ్ ఆప్టిట్యూడ్ ఉంటాయి. పార్ట్ సీలో 100 ప్రశ్నలు, ఐదు ఆప్షనల్ సబ్జెక్టులకు ఉంటుంది.
ఇంగ్లీష్ లో 100 మార్కులకు ఇంగ్లీష్ లో సమాధానాలు ఉంటాయి. 100 మార్కులకు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ లో ఫిజిక్స్ కు 50 మార్కులు, కెమిస్ట్రీకి 50 మార్కులు ఉంటాయి. బయాలజీలో బోటనీకి 50 మార్కులు, జువాలజీకి 50 మార్కులు ఉంటాయి. సోషల్ స్టడీస్ లో జాగ్రఫీకి 35 మార్కులు, హిస్టరీకి 30 మార్కులు, సివిక్స్ కు 15 మార్కులు, ఎకనామిక్స్ కు 20 మార్కులు ఉంటాయి.
అయితే బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు కనీసం 37 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అరర్హత మార్కులు లేవు.
బీఈడీ దరఖాస్తు చేసే అభ్యర్థులు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ లింకును ఫాలో అవ్వాలి. https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetPrintHallTicket.aspx లోకి వెళ్లి, అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, డిగ్రీ లేదా బీటెక్ హాల్ టిక్కెట్టు నెంబర్, డే ఆఫ్ భర్తను ఎంటర్ చేయాలి. అప్పుడు హాల్ టిక్కెట్టు డిస్ ప్లే అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ ఇవ్వచ్చు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం