Appsc Group2 Update: జూలై 28న గ్రూప్-2 మెయిన్స్,జూలై 5 నుంచి పరీక్ష కేంద్రం, పోస్ట్, జోనల్ ఆప్షన్స్ నమోదు
Appsc Group2 Update: ఏపీపీఎస్సీ గ్రూప్ పరీక్షలకు సంబంధించి కీలకమైన అప్డేట్ వెలువడింది. జూలై 28న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల్ని నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.
Appsc Group2 Update: ఏపీపీఎస్సీ గ్రూప్2 పరీక్షలపై కీలకమైన అప్డేట్ వెలువడింది. జూలై 28న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల్ని నిర్వహించనున్నారు. జూన్ 5వ తేదీ నుంచి గ్రూప్ 2 ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు వెబ్ ఆప్షన్స్ అందుబాటులోకి రానున్నాయి. జూన్ 18వరకు ఆప్షన్స్ నమోదుకు అవకాశం కల్పిస్తారు.
ఏపీలో 899 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన నోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 25వ తేదీన పరీక్షల్ని నిర్వహించారు. ఇప్పటికే ప్రిలిమ్స్ ఫలితాలను కమిషన్ విడుదల చేసింది.ఏప్రిల్ 10న ఫలితాలు విడుదల అయ్యాయి. 1:100 నిష్పత్తిలో ప్రాథమిక పరీక్షల్లో అభ్యర్థుల్ని ఎంపిక చేవారు. రాష్ట్ర వ్యాప్తంగా 92,250మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు.
దీంతో గ్రూప్1 మెయిన్స్ పరీక్షల్ని జూలై 28వ తేదీన ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులు జూన్ 5 నుంచి 18వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే పరీక్ష కేంద్రం ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టు ప్రాధాన్యత, జోనల్/జిల్లా ప్రాధాన్యతలను వెబ్ ఆప్షన్లలో సమర్పిం చాలని కమిషన్ సూచించింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి సోమవారం ప్రకటన విడుదల చేశారు.
జూలై 28న మెయిన్స్…
జూలై 28వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఆఫ్‌లైన్ విధానంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 92,250 మంది హాజరవుతారు. మొత్తం 899 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్ 7న నోటిఫికేషన్ జారీ చేశారు.
గ్రూప్ 2 పోస్టుల వివరాలు...
ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-2 నోటి ఫికేషన్‌లో 114 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు, 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, 4 గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు , 16 గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్ పోస్టులు, 28 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులతో పాటు.. 59 ప్రభుత్వ శాఖల్లోని 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తారు. వీటితో పాటు నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌వో), సీనియర్ ఆడిటర్, ఆడి టర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్ల లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి.
ఆఫ్‌లైన్‌లో మెయిన్స్ పరీక్ష…
ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో పేపర్-1, పేపర్ -2లకు 150 మార్కులకు 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. అర్హత సాధించిన అభ్యర్థులు పరీక్ష కేంద్రంతో పాటు, ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్యత, జోనల్ / జిల్లా ప్రాధాన్యతలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్ https://portal-psc.ap.gov.in/Default.aspx నుంచి ఆప్షన్స్ నమోదు చేయాలి.
ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన ఏపీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన 45 రోజుల రికార్డు వ్యవధిలో ఫలితాలను వెల్లడించారు. మెయిన్స్ పరీక్షలకు ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు.
ఏపీలో 2018లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో ప్రిలిమ్స్ రాసిన వారిలో 1:12 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. నిరుద్యోగుల నుంచి ఏపీపీఎస్సీకి అభ్యంతరాలు, వినతులు అందడంతో ఎక్కువ మందికి మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించారు. ఒక్కో పోస్టుకు 100 మందిని ఎంపిక చేశారు. మొత్తం 92,250మంది మెయిన్స్‌కు హాజరు కానున్నారు.
సంబంధిత కథనం