AP TET 2024 Syllabus: టెట్‌ సిలబస్‌‌పై అపోహలు వద్దు,ఫిబ్రవరి సిలబస్‌తోనే పరీక్షల నిర్వహణ, విద్యాశాఖ స్పష్టీకరణ-tet exams will be conducted with february syllabus education department clarification ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet 2024 Syllabus: టెట్‌ సిలబస్‌‌పై అపోహలు వద్దు,ఫిబ్రవరి సిలబస్‌తోనే పరీక్షల నిర్వహణ, విద్యాశాఖ స్పష్టీకరణ

AP TET 2024 Syllabus: టెట్‌ సిలబస్‌‌పై అపోహలు వద్దు,ఫిబ్రవరి సిలబస్‌తోనే పరీక్షల నిర్వహణ, విద్యాశాఖ స్పష్టీకరణ

Sarath chandra.B HT Telugu
Jul 03, 2024 11:07 AM IST

AP TET 2024 Syllabus: ఏపీ టెట్ సిలబస్‌పై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. గత ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్‌ సిలబస్‌తోనే పరీక్షలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ఏపీ టెట్ సిలబస్‌లో మార్పు లేదు
ఏపీ టెట్ సిలబస్‌లో మార్పు లేదు

AP TET 2024 Syllabus: ఏపీ టెట్ సిలబస్ గురించి అభ్యర్థులు అపోహలకు గురి కావొద్దని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. గత ఫిబ్రవరి 2024లో జరగిన టెట్ పరీక్ష సిలబస్ ఆధారంగా పరీక్షకు అభ్యర్థులు సన్నద్ధం కావాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల కోసం మెగా డీఎస్సీ కంటే ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జూలై 4వ తేదీ నుంచి టెట్‌ రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించారు. కొత్తగా అర్హత పొందిన వారితో పాటు పరీక్షలకు సన్నద్ధం కాని వారికి మరో అవకాశం కల్పించేందుకు వీలుగా టెట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్, షెడ్యూల్, సిలబస్ తదితర వివరాలు ఇప్పటికే వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.

మరోవైపు టెట్ నిర్వహణలో పాత సిలబస్ ఉంచినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఇది వాస్తవం కాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో నిర్వహించిన సిలబస్‌తోనే పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు.

టెట్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎలాంటి అపోహలు పడకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నిర్ణయించిన సిలబస్‌తోనే సన్నద్ధం కావాలని సూచించారు.

ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సరైన సిలబస్‌తో పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. పూర్తి సిలబస్‌ వెబ్ సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం