తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live October 10, 2024: Peddapally Murder: ప్రాణం తీసిన ప్రేమ పెళ్ళి...పెద్దపల్లి జిల్లాలో ప్రియుడు దారుణ హత్య
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 10 Oct 202402:20 PM IST
Telangana News Live: Peddapally Murder: ప్రాణం తీసిన ప్రేమ పెళ్ళి...పెద్దపల్లి జిల్లాలో ప్రియుడు దారుణ హత్య
- Peddapally Murder: ప్రేమ పెళ్ళి ప్రియుడి ప్రాణం తీసింది. ఇద్దరు పిల్లల తల్లిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న పాపానికి ప్రియురాలి తొలి భర్తతో పాటు సోదరుడు కత్తులతో దాడి చెసి కడతేర్చారు. ప్రియురాలిపై సైతం దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
Thu, 10 Oct 202401:37 PM IST
Telangana News Live: TG Residential Complex: దసరా కానుక...యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లకు భూమిపూజకు ఏర్పాట్లు
- TG Residential Complex: కార్పోరేట్ విద్యాసంస్థలకు దీటుగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లకు శ్రీకారం చుడుతుంది. దసరా కానుకగా భూమి పూజకు సిద్ధమైంది.వచ్చే విద్యా సంవత్సరం నాటికి భవనాల నిర్మాణం పూర్తిచేసి క్లాసులు ప్రారంభించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
Thu, 10 Oct 202412:11 PM IST
Telangana News Live: DOPT On IAS: ఆ 11 మంది ఐఏఎస్‌లు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాల్సిందే… డిఓపిటీ కీలక ఆదేశాలు
- DOPT On IAS: ప్రత్యుష్ సిన్హా కమిటీ కేటాయింపులకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు డిఓపిటి షాక్ ఇచ్చింది. 11మంది ఐఏఎస్‌లు తెలంగాణ నుంచి ఏపీకి తక్షణం వెళ్లాలని డిఓపిటి ఉత్తర్వులు జారీ చేసింది. పదేళ్లుగా తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌లను ఏపీకి పంపాలని ఆదేశించింది.
Thu, 10 Oct 202411:16 AM IST
Telangana News Live: Central Taxes to Telangana : దసరా కానుక.. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా విడుదల.. ఎంతో తెలుసా?
- Central Taxes to Telangana : రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను విడుదల చేసింది. ముందస్తు వాటాగా రూ.89,086.50 కోట్లతో కలిపి రూ.1,78,173 కోట్లు విడుదల చేసింది.
Thu, 10 Oct 202409:39 AM IST
Telangana News Live: TG Adulterated liquor : మందుబాబులకు అలర్ట్.. కల్తీ మద్యంతో జాగ్రత్త.. మీరు కూడా ఇలా మోసపోవచ్చు!
- TG Adulterated liquor : తెలంగాణలో కల్తీ మద్యం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో పోలీసులు ఓ ముఠాను అరెస్టు చేశారు. తాజాగా మరో ముఠా పోలీసులకు చిక్కింది. ఈ ఇష్యూలో పోలీసులు విచారణ జరపగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఎక్సైజ్ అధికారులు షాకయ్యారు.
Thu, 10 Oct 202408:36 AM IST
Telangana News Live: KTR vs Konda Surekha : మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
- KTR vs Konda Surekha : కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ ఫైట్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా మాజీమంత్రి కేటీఆర్.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. అటు హీరో నాగార్జున కూడా మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు.
Thu, 10 Oct 202407:29 AM IST
Telangana News Live: Hyderabad Rain Alert : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం.. తెలంగాణలోని ఈ జిల్లాలకు అలర్ట్
- Hyderabad Rain Alert : వచ్చే మూడు గంటల్లో హైదరాబాద్‌లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని తెలిపారు. జనగామ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Thu, 10 Oct 202406:25 AM IST
Telangana News Live: TG college Holidays : దసరా తర్వాత డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధిక బంద్.. కారణం ఏంటో తెలుసా?
- TG college Holidays : తెలంగాణలో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల నిర్వాహకుల పరిస్థితి దయనీయంగా తయారైంది. కనీసం భవనాల అద్దెలు చెల్లించడానికి డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ను విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Thu, 10 Oct 202405:45 AM IST
Telangana News Live: Vande Bharat Manufacturing : తెలంగాణలోనే వందేభారత్ తయారీ.. ఎక్కడో తెలుసా?
- Vande Bharat Manufacturing : వరంగల్ ప్రజల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. 45 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కాజీపేటలో కోచ్‌లు తయారు చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించడంతో ఆశలు చిగురిస్తున్నాయి.
Thu, 10 Oct 202405:14 AM IST
Telangana News Live: TG Govt Job Notifications : తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్ - ఆ తర్వాతే ప్రకటనలు..! 10 ముఖ్యమైన అంశాలు
- తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్ పడనుంది. దాదాపు రెండు నెలల తర్వాతే మళ్లీ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీం తీర్పు అమలుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో నోటిఫికేషన్లకు అంతరాయ రానుంది.
Thu, 10 Oct 202404:43 AM IST
Telangana News Live: Hyderabad Traffic : సద్దుల బతుకమ్మ సంబరాలు.. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
- Hyderabad Traffic : హైదరాబాద్ నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్ పరిసరాల తోపాటు.. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రూట్లలో నడిచే బస్సులను దారి మళ్లించారు.
Thu, 10 Oct 202401:52 AM IST
Telangana News Live: Nalgonda District : భర్తే అసలు నిందితుడు..! అంగన్‌వాడీ టీచర్ మృతి కేసులో షాకింగ్ నిజాలు
- నల్గొండ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ అనూష మృతి కేసును పోలీసులు చేధించారు. భర్తే అసలు నిందితుడిగా తేలింది. భార్యను నమ్మించి సాగర్ కాల్వలోకి తోసేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Thu, 10 Oct 202401:06 AM IST
Telangana News Live: Sangareddy : పుట్టిన నిమిషాల్లోనే శిశువు కిడ్నాప్ - ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
- పుట్టిన నిమిషాల్లోనే శిశువు కిడ్నాప్ కు గురి కావటం సంచలనంగా మారింది. ఈ ఘటన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగు చూసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
Thu, 10 Oct 202411:47 PM IST
Telangana News Live: TG CPGET 2024 Updates : టీజీ సీపీగెట్ సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్మెంట్ ఇలా చెక్ చేసుకోండి
- TG CPGET 2024 Counselling : టీజీ సీపీగెట్ -2024 ప్రవేశాలకు సంబంధించి రెండో విడత సీట్లను కేటాయించారు. సీట్లు పొందే విద్యార్థులు అక్టోబర్ 17వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. త్వరలోనే ప్రత్యేక విడత కౌన్సెలింగ్ విడుదలయ్యే అవకాశం ఉంది.