Central Taxes to Telangana : దసరా కానుక.. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా విడుదల.. ఎంతో తెలుసా?
Central Taxes to Telangana : రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను విడుదల చేసింది. ముందస్తు వాటాగా రూ.89,086.50 కోట్లతో కలిపి రూ.1,78,173 కోట్లు విడుదల చేసింది.
వరుస పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. మొత్తంగా రూ.1,78,173 కోట్లు పన్ను వాటాను కేంద్రం విడుదల చేసింది. ముందస్తు వాటాగా రూ.89,086.50 కోట్లతో కలిపి.. రూ.1,78,173 కోట్లు విడుదల చేసింది.
ఈ వాటాల్లో తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు వచ్చాయి. 'ఇది అక్టోబర్ 2024లో సాధారణ వాయిదాతో పాటు ఒక ముందస్తు వాయిదా. ఈ నిధులను రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని విడుదల చేశాం. రాష్ట్రాల మూలధన వ్యయాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి, సంక్షేమ సంబంధిత వ్యయాలకు ఆర్థిక సహాయం చేయడానికి విడుదల చేశాం' అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఈ నిధుల్లో అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌కు రూ. 31,000 కోట్లు, అత్యల్పంగా గోవాకు రూ.688 కోట్లు విడుదలయ్యాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు దక్కాయి.
రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి..
ఆంధ్ర ప్రదేశ్- రూ. 7,211 కోట్లు
అరుణాచల్ ప్రదేశ్- రూ. 3,131 కోట్లు
అస్సాం- రూ. 5,573 కోట్లు
బీహార్- రూ. 17,921 కోట్లు
ఛత్తీస్‌గఢ్- రూ. 6,070
గోవా- రూ.688 కోట్లు
గుజరాత్- రూ. 6,197 కోట్లు
హర్యానా- రూ.1,947 కోట్లు
హిమాచల్ ప్రదేశ్- రూ. 1,479 కోట్లు
జార్ఖండ్- రూ. 5,892 కోట్లు
కర్నాటక- రూ. 6,498 కోట్లు
కేరళ- రూ, 3,430 కోట్లు
మధ్యప్రదేశ్- రూ. 13,987 కోట్లు
మహారాష్ట్ర- రూ.11,255 కోట్లు
మణిపూర్- రూ.1,276 కోట్లు
మేఘాలయ- రూ. 1,367 కోట్లు
మిజోరం- రూ. 891 కోట్లు
నాగాలాండ్- రూ. 1,014 కోట్లు
ఒడిశా- రూ. 8,068 కోట్లు
పంజాబ్- రూ. 3,220 కోట్లు
రాజస్థాన్- రూ. 10,737 కోట్లు
సిక్కిం- రూ. 691 కోట్లు
తమిళనాడు- రూ.7,268 కోట్లు
తెలంగాణ- రూ. 3,745 కోట్లు
త్రిపుర- రూ.1,261 కోట్లు
ఉత్తర ప్రదేశ్- రూ. 31,962 కోట్లు
ఉత్తరాఖండ్- రూ.1,992 కోట్లు
పశ్చిమ బెంగాల్- రూ.13,404 కోట్లు