SCR Special Trains: హైదరాబాద్, తిరుపతి, నర్సాపూర్, నాగర్ సోల్ కు ప్రత్యేక రైళ్లు
Special Trains from ap and telangana: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. తాజాగా హైదరాబాద్, తిరుపతి, నాగర్ సోల్, నర్సాపూర్, యశ్వంతపూర్ కు ప్రత్యేక రైళ్లను ప్రకంటించింది.
South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. హైదరాబాద్ - తిరుపతి, తిరుపతి- హైదరాబాద్, హైదరాబాద్ - నాగర్ సోల్, నాగర్ సోల్ - హైదరాబాద్, నర్సాపూర్ - యశ్వంతపూర్, యశ్వంతపూర్- నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ వివరాలను చూస్తే....
hyderabad tirupati trains:హైదరాబాద్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు. సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్ నుంచి సాయంత్రం 06.15 నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 08.45 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. ఇక తిరుపతి నుంచి సెప్టెంబర్ 17 నుంచి సాయంత్రం 05.15 నిమిషాలకు బయల్దేరి... మరునాడు ఉదయం 07.40 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, రాయచూర్, మంత్రాలయం, గుంతకల్, ఎర్రగుంట, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.ట
hyderabad nagarsole trains:హైదరాబాద్ - నాగర్ సోల్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు., సెప్టెంబర్ 14వ తేదీన హైదరాబాద్ నుంచి సాయంత్రం 05.15 నిమిషాలకు ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 09.25 నిమిషాలకు నాగర్ సోల్ కు చేరుకుంది. ఇక సెప్టెంబర్ 15వ తేదీన నాగర్ సోల్ నుంచి స్పెషల్ ట్రైన్ బయల్దేరుతుంది. ఇది మరునాడు మధ్యాహ్నం 01.00 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది. ఈ రైలు లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, బల్కీ, ఉద్గిర్, లాథుర్ రోడ్, గంగాఖేర,్ సేలూ, పార్థుర్, జల్న, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.
narsapur yesvantpur special traims: నర్సాపూర్ - యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు నర్సాపూర్ నుంచి సెప్టెంబర్ 14వ తేదీన మధ్యాహ్నం 03.10 నిమిషాలకు బయల్దేరుతుంది. తిరిగి మరునాడు ఉదయం 10.50 నిమిషాలకు యశ్వంతపూర్ కు చేరుకుంటుంది. ఇక యశ్వంతపూర్ నుంచి సెప్టెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 03.50 నిమిషాలకు బయల్దేరి... మరునాడు ఉదయం 08.30 నిమిషాలకు యశ్వంతపూర్ చేరుతుంది.
ఈ ట్రైన్ పాలకొల్లు, భీమవరం, అక్కివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, దోనకొండ, మార్కపూర్, గిద్దలూరు, నంధ్యాల్, డోన్, అనంతపూర్, ధర్మవరం, పెనుకొండ, హిందూపూర్, ఎల్హాంక స్టేషన్లలో ఆగుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రయాణికులకను కోరారు.