Special Trains: కాచిగూడ, తిరుపతి, నాగర్ సోల్, బెంగళూరుకు స్పెషల్ ట్రైన్లు-south central railway announced special trains between various destinations full details here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  South Central Railway Announced Special Trains Between Various Destinations Full Details Here

Special Trains: కాచిగూడ, తిరుపతి, నాగర్ సోల్, బెంగళూరుకు స్పెషల్ ట్రైన్లు

Mahendra Maheshwaram HT Telugu
Aug 25, 2022 06:34 AM IST

Special Trains From Telugu States: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. కాచిగూడ నుంచి తిరుపతి, నాగర్ సోల్ కి స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. నాందేడ్ నుంచి యశ్వంతపూర్ కు స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను ప్రకటించింది.

కాచిగూడ తిరుపతి ప్రత్యేక రైళ్లు,
కాచిగూడ తిరుపతి ప్రత్యేక రైళ్లు,

South Central Railway Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో కాచిగూడ, తిరుపతి, నాగర్ సోల్, యశ్వంతపూర్ ల నుంచి నడపనున్నాయి. ఈ మేరకు వివరాలను ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

kachiguda - tirupati special trains: కాచిగూడ నుంచి తిరుపతికి ఈ నెల 26న స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 22.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.00 గంటలకు గమ్యానికి చేరుతుంది. తిరుపతి-కాచిగూడ ప్రత్యేక ట్రెన్ ఈ నెల 27న నడపనున్నారు. ఈ ట్రైన్ 15.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 03:45 గంటలకు గమ్యానికి చేరుతుంది. ఈ స్పెషల్ ట్రైన్లు షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

kachiguda -nagarsole special trains: కాచిగూడ-నాగర్ సోల్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 28న ప్రకటించారు. ఈ ట్రైన్ రాత్రి 08.20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08.35 గంటలకు గమ్యానికి చేరుతుంది. నాగర్ సోల్ -కాచిగూడ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 29న ప్రకటించారు. ఈ ట్రైన్ 22.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 09.45 గంటలకు గమ్యానికి చేరుతుంది. ఈ ట్రైన్లు మల్కాజ్ గిరి, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, నాందేడ్, పూర్ణ, జాల్నా, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.

nanded to yesvantpur special trains: నాందేడ్- యశ్వంతపూర స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 30న ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 13.35 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 10.30 గంటలకు గమ్యానికి చేరుతుంది. యశ్వంతపూర్-నాందేడ్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 31న ప్రకటించారు. ఈ ట్రైన్ 17.20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 15.30 గంటలకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.

ప్రత్యేక రైళ్లు ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, అనంతపూర్, ధర్మవరం, పెనుగొండ, హిందూపూర్, యల్హంక స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు.

ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.

IPL_Entry_Point