SCR: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు-4 summer special trains between kacheguda to tirupati full details here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

SCR: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu
Jun 03, 2022 03:24 PM IST

వేసవి సీజన్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చేసింది. కాచిగూడ - తిరుపతి మధ్య 4 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ను నడపనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే వివరాలను వెల్లడించింది.

కాచిగూడ - తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు
కాచిగూడ - తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. వేసవి సీజన్ లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కాచిగూడ -తిరుపతి మధ్య 04 వేసవి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ స్పెషల్ ట్రైన్ (నెం.07297) జూన్ 8, 15 తేదీల్లో రాత్రి 10.20 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. మరునాడు ఉదయం 11 గం.లకు తిరుపతి చేరుకుంటుంది.

ఇక జూన్ 9, 16వ తేదీల్లో మధ్యాహ్నం 03.00 గం.లకు ప్రత్యే రైలు (నెం.07298) తిరుపతి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 04.00 గం.లకు కాచిగూడకు చేరుకుంటుంది.

 

 

ఆగేది ఈ స్టేషన్లలోనే...

ఈ ప్రత్యేక రైళ్లు షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గోటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సర్వీసుల్లో ఏసీ, ఏసీ టైర్ 2, ఏసీ టైర్ -3, స్లిపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని తెలిపింది. ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఈ స్పెషల్ ట్రైన్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణీకులు శ్రీవారి దర్శనానికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్