South Central Railway : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ టూ తిరుపతి ప్రత్యేక రైళ్లు-south central railway announce special trains from secunderabad to tirupati ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  South Central Railway : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ టూ తిరుపతి ప్రత్యేక రైళ్లు

South Central Railway : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ టూ తిరుపతి ప్రత్యేక రైళ్లు

Anand Sai HT Telugu
Aug 08, 2022 08:26 PM IST

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు కాజీపేట మీదుగా సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు (unplash)

తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. కాజీపేట మీదుగా సికింద్రాబాద్-తిరుపతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

ప్రత్యేక రైలు (నెం.07469) సికింద్రాబాద్‌లో ఆగస్టు 11, 13 తేదీల్లో సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అలాగే, ప్రత్యేక రైలు (నెం.07470) ఆగస్టు 12, 14 తేదీల్లో తిరుపతి నుంచి ఉదయం 8.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 8.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ జనరల్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

ఇప్పటికే తిరుపతి నుంచి నాందేడ్, వికారాబాద్ కు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. నాందేడ్ - తిరుపతి (07651) ట్రైన్ సోమవారం బయల్దేరుతుంది. రాత్రి 10.45 గంటలకు బయల్దేరి... మరునాడు రాత్రి 7.15 నిమిషాలకు చేరుకుంటుంది. తిరుపతి - వికారాబాద్ (07652) మధ్య మంగళవారం ప్రత్యేక ట్రైన్ బయల్దేరనుంది. తిరుపతి నుంచి రాత్రి 10. 20 గంటలకు బయల్దేరి... మరునాడు 12.45 నిమిషాలకు వికారాబాద్ చేరుకుంటుంది.

తిరుపతి - వికారాబాద్ వెళ్లే ట్రైన్.. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లు, నడికూడ, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ , లింగపల్లి స్టేషన్లల్లో ఆగుతుంది. నాందేడ్ - తిరుపతి వెళ్లే స్పెషల్ ట్రైన్... ముదుఖేడ్, ధర్మాబాజ్, బాసర్, నిజామాబాజ్, కామారెడ్డి, అక్కన్నపేట్, మేడ్చల్, మాల్కాజ్ గిరి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్లు, సత్తెనపల్లి, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం