Special Trains: నాందేడ్ - తిరుపతి - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు-special trains between nanded to tirupati and tirupati to vikarabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Special Trains: నాందేడ్ - తిరుపతి - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

Special Trains: నాందేడ్ - తిరుపతి - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

Mahendra Maheshwaram HT Telugu
Aug 05, 2022 04:48 PM IST

south central railway special trains: తిరుపతి నుంచి నాందేడ్, వికారాబాద్ కు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

special trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. ఇప్పటికే పలు ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకురాగా... తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

nanded to tirupati special trains: నాందేడ్ - తిరుపతి (07651) ట్రైన్ సోమవారం బయల్దేరుతుంది. రాత్రి 10.45 గంటలకు బయల్దేరి... మరునాడు రాత్రి 07.15 నిమిషాలకు చేరుకుంటుంది. తిరుపతి - వికారాబాద్ (07652) మధ్య మంగళవారం ప్రత్యేక ట్రైన్ బయల్దేరనుంది. తిరుపతి నుంచి రాత్రి 10. 20 గంటలకు బయల్దేరి... మరునాడు 12.45 నిమిషాలకు వికారాబాద్ చేరుకుంటుంది.

ఆగే స్టేషన్లు ఇవే...

తిరుపతి - వికారాబాద్ వెళ్లే ట్రైన్.... రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లు, నడికూడ, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ , లింగపల్లి స్టేషన్లల్లో ఆగుతుంది. నాందేడ్ - తిరుపతి వెళ్లే స్పెషల్ ట్రైన్... ముదుఖేడ్, ధర్మాబాజ్, బాసర్, నిజామాబాజ్, కామారెడ్డి, అక్కన్నపేట్, మేడ్చల్, మాల్కాజ్ గిరి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్లు, సత్తెనపల్లి, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక రైళ్లల్లో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

మరోవైపు నాందేడ్-హుబ్లీ (Hubballi) స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 6వ తేదీన నడపనున్నారు. ఈ ట్రైన్ 14.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 09 గంటలకు గమ్యానికి చేరుతుంది. హుబ్లీ(Hubballi)-నాందేడ్ ట్రైన్ ను ఈ నెల7 నడపనున్నారు. ఈ ట్రైన్ ఆయా తేదీల్లో 11.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08.10 గంటలకు గమ్యానికి చేరుతుంది. ఈ రైళ్లలో 1AC, 2AC, 3AC స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.

IPL_Entry_Point