Tirupati Special Trains: తిరుపతికి స్పెషల్ ట్రైన్స్, వయా వికారాబాద్ - వివరాలివే-south central railway announced one way special trains for tirupati pilgrims ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati Special Trains: తిరుపతికి స్పెషల్ ట్రైన్స్, వయా వికారాబాద్ - వివరాలివే

Tirupati Special Trains: తిరుపతికి స్పెషల్ ట్రైన్స్, వయా వికారాబాద్ - వివరాలివే

HT Telugu Desk HT Telugu
Sep 07, 2022 12:55 PM IST

Special Trains to Tirupati: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది.

హైదరాబాద్ తిరుపతి ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ తిరుపతి ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్‌లో తిరుపతి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వీటిని ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో హైదరాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇవి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వన్ వే స్పెషల్ ట్రైన్స్ మాత్రమే.

హైదరాబాద్ నుంచి తిరుపతికి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సెప్టెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.15 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

వెళ్లే రూట్..

ఈ ప్రత్యేక రైలు బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సులేహల్లి, రాయిచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రైలులో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ రైళ్లకు ఇప్పటికే రిజర్వేషన్ ప్రారంభమైంది. తిరుపతి వెళ్లాలనుకునేవారు టికెట్ రిజర్వేషన్ చేయొచ్చు. ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు తిరుపతి-బిలాస్‌పూర్ మధ్య నడిచే రైళ్లను దారి మళ్లించడంతో పాటు రీషెడ్యూల్ చేసింది దక్షిణ మధ్య రైల్వే. తిరుపతి నుంచి బిలాస్‌పూర్ మధ్య అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 8, 11 తేదీల్లో ఈ రైలు తిత్లాగఢ్, సంబాల్‌పూర్, ఝర్సుగూడ, బిలాస్‌పూర్ రూట్‌లో ప్రయాణిస్తుంది. బిలాస్‌పూర్ నుంచి తిరుపతి రూట్‌లో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 10, 13 తేదీల్లో ఈ రైలు బిలాస్‌పూర్, సంబాల్‌పూర్, ఝర్సుగూడ, తిత్లాగఢ్ రూట్‌లో ప్రయాణిస్తుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం