New train time table : అక్టోబర్​ 1 నుంచి రైల్వే టైమ్​ టేబుల్​లో భారీ మార్పులు..!-new train time table likely to be implemented from october ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  New Train Time Table : అక్టోబర్​ 1 నుంచి రైల్వే టైమ్​ టేబుల్​లో భారీ మార్పులు..!

New train time table : అక్టోబర్​ 1 నుంచి రైల్వే టైమ్​ టేబుల్​లో భారీ మార్పులు..!

Sharath Chitturi HT Telugu
Sep 05, 2022 08:29 PM IST

New train time table : అక్టోబర్​ 1 నుంచి రైల్వే టైమ్​ టేబుల్​లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది!

అక్టోబర్​ 1 నుంచి రైల్వే టైమ్​ టేబుల్​లో మార్పులు..!
అక్టోబర్​ 1 నుంచి రైల్వే టైమ్​ టేబుల్​లో మార్పులు..! (HT_PRINT)

New train time table : రైల్వే ప్రయాణికులకు అలర్ట్​..! త్వరలోనే రైళ్ల టైమ్​ టేబుల్​లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైళ్లకు సంబంధించిన కొత్త టైమ్​ టేబుల్​.. అక్టోబర్​ 1న అమల్లోకి వేచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

రైళ్ల కొత్త టైమ్​ టేబుల్​కి సంబంధించి.. ఇప్పటికే వేగంగా పనులు జరుగుతున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తక్కువ ప్యాసింజర్లు ఉన్న స్టేషన్లపై భారతీయ రైల్వే సమీక్ష నిర్వహించిందని పేర్కొన్నాయి. ఆయా రైల్వే స్టేషన్లలో స్టాప్​లను తొలగించేందుకు యోచిస్తున్నట్టు చెప్పాయి.

ఇదే జరిగితే.. తక్కువ స్టేషన్ల వల్ల.. ప్రయాణ సమయం తగ్గుతుంది. మరింత వేగంగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే రైళ్ల కొత్త టైమ్​ టేబుల్​ను భారతీయ రైల్వే రూపొందిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా.. సుదీర్ఘ ప్రయాణాలు చేసే రైళ్లకు ఇది వర్తిస్తుందని తెలుస్తోంది.

Change in train timings : చివరిసారిగా 2021లో రైళ్ల టైమ్​ టేబుల్​ను మార్చింది భారతీయ రైల్వే. ఆ టైమ్​ టేబుల్​ కూడా అక్టోబర్​ 1 నుంచే అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో స్పెషల్​ ట్రైన్​లు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు స్పెషల్​ ట్రైన్​ల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇక రానున్న రోజుల్లో.. రైళ్ల ఎలక్ట్రిఫికేషన్​ పనులు కూడా పూర్తవుతాయి. మరిన్ని రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తాయి. వాటిని అమల్లోకి తీసుకురావాలని రైల్వే యోచిస్తోంది.

ఈ కారణాలతో.. రైళ్ల కొత్త టైమ్​ టేబుల్​ను అమలు చేయాల్సిన అవసరం ఉందని రైల్వే భావిస్తున్నట్టు సమాచారం. అక్టోబర్​ 1 నుంచి ఇది అమల్లోకి రావొచ్చని తెలుస్తోంది.

కాగా.. ఈ వ్యవహారంపై భారతీయ రైల్వే ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం