CM KCR Peddapalli Speech : గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే-cm kcr sensational comments on pm modi in peddapalli ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Sensational Comments On Pm Modi In Peddapalli

CM KCR Peddapalli Speech : గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 06:05 PM IST

KCR Comments On Modi : ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక.. ఎవరూ ఊహించని కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ఉద్యమం సమయంలో పెద్దపల్లిలో జెండా ఎగరేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. రూ. 48 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను ప్రారంభించారు. పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల సువిశాల విస్తీర్ణ స్థలంలో నిర్మించిన కార్యాలయాల సముదాయంలో పూజలు చేశారు. మంథని రోడ్డులో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే అని విమర్శించారు సీఎం కేసీఆర్. 'పెద్దపల్లిలో ఉద్యమ సమయంలో అనేకసార్లు జెండా ఎగురవేశాను. సింగరేణిలో వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. సింగరేణి కార్మికులకు భారీగా బోనస్‌ అందజేస్తున్నాం. పెద్దపల్లిలో మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ఇటీవల జాతీయ రైతు నాయకులు కలిశారు. జాతీయ పార్టీలోకి రావాలని కోరుతున్నారు. గుజరాత్‌ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను దగా చేస్తున్నారు. ప్రజల మధ్య ద్వేషం రేపే వాళ్లను చైతన్య వంతులపై బుద్ధి చెప్పాలి. నేను చెప్పే మాటల్లో సత్యం ఉన్నది.. అందుకే వర్షం పడుతోంది.' అని కేసీఆర్ అన్నారు.

గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు ఇష్టం వచ్చినట్టుగా పెంచారని కేసీఆర్ విమర్శించారు. రూ.లక్షల కోట్ల మేర కుంభకోణాలు చేస్తున్నారని ఆరోపించారు. మద్యపాన నిషేధం విధించిన గుజరాత్ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారిందని, 70 మంది మృతికి కేంద్రమే జవాబు చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దోపిడీ తప్ప మరొకటి లేదని విమర్శించారు. 60 ఏళ్లు కొట్లాడి తెలంగాణ ఆత్మగౌరవం సాధించాం. దేశ ఆర్థిక విలువ దిగజార్చి రూపాయి విలువ పతనం చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మోసపోతే గోసపడుతామని మరోసారి అన్నారు.

జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలు కోరారని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. మీటర్లు లేని విద్యుత్‌ సరఫరా చేయాలని అడిగినట్టుగా చెప్పారు. ఎన్‌పీఏల పేరుతో రూ.12 లక్షల కోట్లు దోచి పెట్టారని ఆరోపించారు. రైతులకు ఇవ్వడానికి మాత్రం కేంద్రానికి చేతులు రావట్లేదని, సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను భగ్నం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. బీజేపీ ముక్త్ భారత్‌ కోసం అందరూ సన్నద్ధం కావాలన్నారు.

'బీజేపీని పారద్రోలి రైతు ప్రభుత్వం రాబోతోంది. గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే. దేశంలోని రైతులు సాగుకు వాడే విద్యుత్‌ 20.8 శాతమే. దేశంలో సాగుకు వాడే విద్యుత్‌ ఖరీదు రూ.1.45 లక్షల కోట్లు. కార్పొరేట్‌ దొంగలకు దోచి పెట్టినంత సొమ్ము కాదు. మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోదీకే మీటర్‌ పెట్టాలి. పెద్దపల్లిలోని ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు అందుతాయి. గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నాం. రామగుండం కార్పొరేషన్‌కు రూ.కోటి మంజూరు. మూడు మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేయమని ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నా.' అని కేసీఆర్ అన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం