TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ-ap ts weather moderate to heavy rains in many districts coming four days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ap Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Bandaru Satyaprasad HT Telugu
May 05, 2024 09:27 PM IST

TS AP Rains : ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఈ నెల 9 వరకు, ఏపీ రాబోయే రెండ్రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు
తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు

TS AP Rains : ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాబోయే మూడు, నాలుగు రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలు(AP TS Rains) కురుస్తాయని ప్రకటించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వడగండ్ల వానలు పడతాయని హెచ్చరించింది. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. జనగామ జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లాలో సైతం ఈదురుగాలుతో వర్షం పడింది. ములుగు, నల్గొండ జిల్లా్ల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(TS Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మే 6న ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు

రేపు(సోమవారం) భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో పాటు ఆదిలాబాద్‌, మంచిర్యాలు, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, సిరిసిల్ల , జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో 46 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి(మంగళవారం) రంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు(TS Rains) కురుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే ఖమ్మం, సిద్ధిపేట, కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీంతో పాటు వడగాల్పులు(Heat Wave) తీవ్రంగా ఉంటాయని చెప్పారు.

ఏపీలో వర్షాలు

ఏపీలో రాబోయే రెండు రోజులు(AP Rains) వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ, యానంలో రేపు మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు(Moderate Rains) కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో , ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే పలు ప్రాంతాల్లో వేడి, తేమతో అసౌకర్యమైన వాతావరణం ఉందని చెప్పారు. అలాగే ఎల్లుండి(మంగళవారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని తెలిపారు.

రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు

సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా పిడుగుల(Thunderstorm)తో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతుందన్నారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు,కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించారు. రేపు శ్రీకాకుళం 10, విజయనగరం 13, మన్యం 6 మండలాల్లో వడగాల్పులు(Heat Wave) వీచే అవకాశం ఉందన్నారు. ఆదివారం నంద్యాల జిల్లా మహానందిలో 45.8°C అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు.

Whats_app_banner

సంబంధిత కథనం