Tips For Fresh Fish : ఫ్రెష్ చేపలు కావాలా నాయనా? మార్కెట్లో జాగ్రత్త.. ఇదిగో టిప్స్-you can follow these steps to buy fresh fish ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tips For Fresh Fish : ఫ్రెష్ చేపలు కావాలా నాయనా? మార్కెట్లో జాగ్రత్త.. ఇదిగో టిప్స్

Tips For Fresh Fish : ఫ్రెష్ చేపలు కావాలా నాయనా? మార్కెట్లో జాగ్రత్త.. ఇదిగో టిప్స్

HT Telugu Desk HT Telugu
Feb 06, 2023 11:51 AM IST

Tips For Buy Fresh Fish : చాలామందికి చేపలు అంటే తెగ ఇష్టం. చేపల పులుసు పెట్టుకుని.. తింటే వచ్చే కిక్కే వేరు. కానీ మార్కెట్ నుంచి కొనుక్కొచ్చేవి ఫ్రెష్ ఫిష్ అని ఎలా తెలియాలి? సో.. తాజా తాజా చేపలు కావాలంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు పాటించండి..

చేపలు
చేపలు

చేపలు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి. కొంతమంది చాలా ఇష్టంగా తింటారు.. నాన్ వేజ్(Non Veg) ఇష్టపడే వ్యక్తులు చేపలను తృప్తిగా తింటారు. ఈ మధ్యకాలంలో చేపల ధరలు బాగానే పెరిగాయి. ఇదంతా సరే.. అన్ని డబ్బులు పెట్టి.. ఫ్రెష్ ఫిష్(Fresh Fish) తెచ్చుకోకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. డబ్బులు వేస్ట్.. ఆరోగ్యం కూడా పాడవుతుంది. మరి మార్కెట్(Market) వెళితే తాజా చేపలను ఎలా గుర్తించాలి? రెండు మూడు రోజుల నుంచి ఐస్ లో పెట్టిన వాటి గురించి ఎలా తెలుసుకోవాలి?

మార్కెట్లోకి వచ్చిన చేపలు(Fish) చూస్తే.. అన్నీ ఫ్రెష్ లాగానే అనిపిస్తాయి. అమ్మేవాళ్లు కూడా.. ఇప్పుడే పట్టుకొచ్చామని చెబుతుంటారు. వాళ్లకు అమ్ముడుకావాలి కాబట్టి అలా చెబుతారు. మరి కొనే మీరు మాత్రం కాస్త జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. లేదంటే ఎప్పుడో పట్టి ఐస్ బాక్సుల్లో(Ice Box) పెట్టిన చేపలు.. మీ ఇంట్లో పులుసు అవుతుంది. చేపలు కొనడం చిన్న విషయమే.. కానీ ఎప్పుడో పట్టినవి కొని తింటే మీకే అనారోగ్యం. తికమక పడకుండా.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫ్రెష్ ఫిష్ కొనుకోవచ్చు.

చేపలను ఐస్ బాక్సుల్లో పెట్టి అమ్ముతుంటారు. ఎప్పుడో పట్టినవి.. తీసుకొస్తారు. అలాంటివి తినడం వలన అనారోగ్యం పాలవుతారు. చేపల కారణంగా శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు వస్తాయి. అందుకే తీసుకునేది తాజావి అయి ఉండాలి.

చేపలు కొనేప్పుడు వాటి కళ్లను చూడాలి. స్పష్టంగా ఉంటే అది మంచి చేప. చేప మెరుస్తూ ఉండాలి. వాటి కళ్లు మబ్బుగా ఉంటే.. కొనకుండా ఉండటమే బెటర్. కచ్చితంగా మీరు కొనేముందు చేపను నొక్కండి. అది మెత్తగా ఉంటే.. తినడానికి పనికి రాదు. పట్టి చాలా రోజులవుతుందని అర్థం. సో.. గట్టిగా ఉండాలి. తాజా చేప తోక మెరుస్తుంది. నిల్వ ఉన్న చేప శరీరభాగం.. వదులుగా మారి మృదువుగా ఉంటుంది. చేపల మెుప్పలను కూడా చెక్(Check) చేసుకోవాలి. రక్త ప్రవాహం తాజాగా ఉన్నట్టు కనిపిస్తే.. ఫ్రెష్ చేప. ఒకవేళ రక్తం గడ్డకట్టినట్టుగా అనిపిస్తే.. అది స్టోర్ చేసినది. ఎక్కువ వాసన వచ్చినా.. వాటిని కొనకపోవడమే మంచిది.

చేప కళ్ల(Fish Eye) గుడ్డును కూడా పరిశీలించండి. కళ్ల గుడ్డు లోపలికి వెళ్లినా.. కళ్లపై తెల్లటి పొర ఏర్పడినా తాజా కాదు. చేపలకు మొప్పల కింద.. తేమతో కూడిన గులాబీ రంగు ఉంటే తాజా చేపలే. చేపల నుంచి వెలువడే వాసన ఆధారంగా చేపలు తాజావో కాదో గుర్తించొచ్చు.

చేపలు తినడం కారణంగా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయి. చేపలలో శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉండవు. మీ గుండె పనితీరు బాగుంటుంది. చేపల ద్వారా వచ్చే ప్రోటిన్లు చాలా మంచిది. చేపల ద్వారా విటమిన్ డి శరీరానికి అందుతుంది.

Whats_app_banner