Ice Cream Plant In TS : ఇండియాలో అతిపెద్ద ఐస్‌క్రీం తయారీ యూనిట్ తెలంగాణలోనే
KTR On Ice Cream Plant : భారతదేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం తయారీ యూనిట్‌కు తెలంగాణ నిలయమైంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ వివరాలు ప్రకటించారు.
అతిపెద్ద ఐస్ క్రీం(Ice Cream) తయారీ యూనిట్ తెలంగాణలో ఏర్పాటు అయింది. జహీరాబాద్‌లో అరుణ్ ఐస్‌క్రీమ్స్(Arun Ice Cream), ఇబాకోగా ప్రసిద్ధి చెందిన Hatsun ద్వారా రోజుకు ఏడు టన్నుల చాక్లెట్ ప్రాసెసింగ్ ప్లాంట్, రోజుకు 100 టన్నుల ఐస్‌క్రీమ్ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. దీంతో తెలంగాణ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం తయారీ యూనిట్‌గా అవతరించిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఈ మేరకు గురువారం మంత్రి కేటీఆర్(KTR) వివరాలు ప్రకటించారు. రూ.400 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో హ్యాట్సన్ మొత్తం రూ.600 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తెలంగాణలో జరుగుతున్న 'శ్వేత విప్లవం'కు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు మంత్రి. ఈ యూనిట్ ద్వారా రోజుకు 10 లక్షల లీటర్ల పాలను సేకరించి 5,000 మంది స్థానిక పాడి రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. దీని ద్వారా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.
'హాట్సన్ ద్వారా రోజుకు 7 టన్నుల చాక్లెట్ ప్రాసెసింగ్ ప్లాంట్, రోజుకు 100 టన్నుల ఐస్‌క్రీమ్ తయారీ ప్లాంట్‌ను ప్రారంభవుతోంది. తెలంగాణలోని జహీరాబాద్‌లోని అరుణ్ ఐస్ క్రీమ్‌లు అండ్ ఇబాకో భారతదేశంలో అతిపెద్ద ఐస్‌క్రీం తయారీ యూనిట్‌కు నిలయంగా ఉందని పంచుకోవడం సంతోషంగా ఉంది.' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీ జహీరాబాద్‌లో ప్రారంభం కావడంపై మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. హాట్సన్ కంపెనీ ద్వారా రోజుకు 7 టన్నుల చాకోలెట్స్, 100 టన్నుల ఐస్‌క్రీంను ప్రాసెస్ చేస్తారన్నారు. ప్రసిద్ధి గాంచిన అరుణ్ ఐస్ క్రీమ్స్, ఐబాకో జహీరాబాద్‌లో ఉత్పత్తి చేయనున్నట్టుగా వెల్లడించారు.