Stock market news today : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీకి 50 పాయింట్లు లాస్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 98 పాయింట్ల నష్టంతో 60,743 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 57 పాయింట్లు కోల్పోయి 17,797 వద్ద ట్రేడ్ అవుతోంది.
అంతర్జాతీయ సానుకూల పవనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను భారీ లాభాల్లో ముగించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 243 పాయింట్లు పెరిగి 17,854 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 909 పాయింట్ల లాభంతో 60,841 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ.. 830 పాయింట్లు వృద్ధి చెంది 41,499 లెవల్ వద్ద క్లోజ్ అయ్యింది. మంగళవారం ట్రేడంగ్ సెషన్‌ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 60,847- 17,819 వద్ద మొదలుపెట్టాయి.
స్టాక్స్ టు బై..
Stocks to buy list పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ):- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 48, టార్గెట్ రూ. 56
ఓఎన్జీసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 140, టార్గెట్ రూ. 150
SBI share price target : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ):- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 505, టార్గెట్ రూ. 610
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
ఎస్బీఐ, ఐటీసీ, ఇండస్ఇండ్, ఎల్టీ, బజాజ్ఫినాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఎయిర్టెల్, హెచ్‌సీఎల్‌టెక్, విప్రో, సన్‌ఫార్మా, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock market investment : అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.3శాతం, ఎస్ అండ్ పీ 500 1.04శాతం, నాస్డాక్ 1.59శాతం నష్టాపోయాయి.
ఆసియా మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.7శాతం నష్టాల్లో ఉంది. సౌత్ కొరియా కాస్పి 1శాతం నష్టపోయింది.
త్రైమాసిక ఫలితాలు..
Tata steel Q3 results : టాటా స్టీల్, అదానీ ట్రాన్స్మిషన్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్, బాలాజీ అమైన్స్, ఈజీ ట్రిప్ ప్లానర్స్‌తో పాటు మరిన్ని సంస్థల త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 932.44కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1264.74కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.