World Lung Cancer Day: ఇలాంటి తేలికపాటి లక్షణాలు కూడా క్యాన్సర్‌కు సంకేతాలే, జాగ్రత్త పడండి-world lung cancer day even mild symptoms like these are signs of cancer beware ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Lung Cancer Day: ఇలాంటి తేలికపాటి లక్షణాలు కూడా క్యాన్సర్‌కు సంకేతాలే, జాగ్రత్త పడండి

World Lung Cancer Day: ఇలాంటి తేలికపాటి లక్షణాలు కూడా క్యాన్సర్‌కు సంకేతాలే, జాగ్రత్త పడండి

Haritha Chappa HT Telugu
Aug 01, 2024 11:51 AM IST

World Lung Cancer Day: ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా, ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం
ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం (shutterstock)

ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం ఆగస్టు 1న నిర్వహించుకుంటారు. ఈ ప్రమాదకరమైన వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం వెనుక ఉద్దేశం. క్యాన్సర్ మరణాల్లో ఊపిరితిత్తుల కేన్సర్ రోగులే ఎక్కువగా ఉన్నారు. ధూమపానం మాత్రమే కాదు ఇతర కారణాలు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణమవుతాయి. ఊపిరితిత్తుల్లో కనిపించే ప్రారంభ లక్షణాలను గుర్తిస్తే ఈ వ్యాధి నుంచి మరణాన్ని నివారించవచ్చు. ఇలాంటి లక్షణాలు శరీరంలో కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.

కొన్ని రకాల లక్షణాలు కనిపించినప్పుడు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఊపిరితిత్తుల కేన్సర్ కూడా చాలా సైలెంట్ గా ఎటాక్ చేస్తుంది. దీన్ని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్స సాయంతో సరిదిద్దుకోవచ్చు.

ఊపిరితిత్తుల లక్షణాలు

నిరంతరం దగ్గు వస్తుంటే దాన్ని తేలికగా తీసుకోకూడదు. దగ్గుతో కూడిన రక్తం, శ్లేష్మం బయటకు వస్తుంటే అది క్యాన్సర్ సంకేతం కావచ్చు. వేగంగా శ్వాస తీసుకుంటున్నప్పుడు ఛాతీ నొప్పి వస్తుంది. ఈ నొప్పి దగ్గినప్పుడు, నవ్వేటప్పుడు కూడా సంభవిస్తుంది. బరువు హఠాత్తుగా తగ్గిపోతారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఎల్లప్పుడూ అలసట, బలహీనంగా అనిపిస్తుంది.

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తుంటాయి. బ్రోన్కైటిస్, న్యుమోనియా వంటి సమస్యలు వచ్చిన అవి తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడంతో ఛాతీలో శ్వాస పీల్చే శబ్దం మొదలైంది. ఆ స్వరం రోజురోజుకూ బరువెక్కుతోంది.

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, ఊపిరితిత్తుల క్యాన్సర్ శరీరంలోని మరొక భాగానికి వ్యాపిస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఎముకలలో నొప్పి, ముఖ్యంగా వెన్ను, తుంటి నొప్పి వస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ నాడీ వ్యవస్థలో మార్పులకు కారణమవుతుంది. దీని వల్ల నీరసం, తలనొప్పి, చేతులు, కాళ్లలో తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూర్ఛలు ప్రారంభమవుతాయి. శరీరాన్ని సమతుల్యం చేయడంలో ఇబ్బంది ఉంటుంది.

చర్మం, కన్ను పసుపు రంగులో కనిపిస్తాయి. దీనికి కారణం క్యాన్సర్ కణాలు కాలేయానికి చేరి అక్కడ పేరుకుపోతాయి. దీని వల్ల రంగు మారుతుంది. శోషరస కణుపు వాపు కూడా వస్తుంది. ఇది తరచుగా మెడ దగ్గర కాలర్ బోన్చ మెడ వాపుకు కారణం అవుతుంది.

కుటుంబంలో ఎవరికైనా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే... వారి వారసులకు వచ్చే అవకాశం ఎక్కువ. కొన్ని రకాల టాక్సిన్ల వల్ల కూడా ఈ క్యాన్సర్ రావచ్చు. రాడాన్, ఆస్పెస్టాస్ వంటి ఏజెంట్లు శరీరంలో చేరినా కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. హెచ్ఐవీ ఉన్న వ్యక్తులకు, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ వాడే వారిలో కూడా ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

Whats_app_banner