Head and Neck Cancer: ఇలాంటి పనులు చేస్తే తలా, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశం, జాగ్రత్త పడండి-if you do such things you may get head and neck cancer be careful ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Head And Neck Cancer: ఇలాంటి పనులు చేస్తే తలా, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశం, జాగ్రత్త పడండి

Head and Neck Cancer: ఇలాంటి పనులు చేస్తే తలా, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశం, జాగ్రత్త పడండి

Haritha Chappa HT Telugu
Jul 29, 2024 04:30 PM IST

Head and Neck Cancer: తల, మెడ క్యాన్సర్ భారతదేశంలో పాకిపోతుంది. ఎంతో మంది ఈ క్యాన్సర్ తో బాధపడుతున్నవారు. ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడంతో పాటూ కొన్ని మార్పులు చేసుకోవాలి.

తల, మెడ క్యాన్సర్ లక్షణాలు
తల, మెడ క్యాన్సర్ లక్షణాలు (Pixabay)

తల, మెడ క్యాన్సర్… ప్రస్తుతం భారతదేశంలో పెద్ద సవాలుగా మారిన క్యాన్సర్ ఇది. - నోరు, సైనస్, ముక్కు, గొంతు భాగంలో వచ్చే క్యాన్సర్ల సమూహం ఇది. మనదేశంలో 26 శాతం మంది తల, మెడ క్యాన్సర్ తో బాధపడుతున్నవారు ఉన్నారు. ఒక అధ్యయనం ప్రకారం ఇలాంటి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. తల, మెడ క్యాన్సర్ కొన్ని సాధారణ లక్షణాలను చూపిస్తుంది.

yearly horoscope entry point

తల, మెడ క్యాన్సర్ లక్షణాలు

ఈ క్యాన్సర్ కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. నిరంతరం గొంతునొప్పి వస్తుంది. ఆహారం మింగడంలో ఇబ్బంది పడుతుంది. స్వరంలో మార్పు వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈ క్యాన్సర్ రాకుండా బయటపడవచ్చు.

కొన్ని జీవనశైలి మార్పులతో, తల, మెడ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సునాక్ట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ పాటిల్ హెచ్టి లైఫ్ స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, "తల, మెడ క్యాన్సర్లు నోరు, గొంతు, స్వరపేటిక, సైనస్, లాలాజల గ్రంథులను ప్రభావితం చేసే అనేక రకాల ప్రాణాంతక వ్యాధులను కలిగి ఉంటాయి. ఈ క్యాన్సర్లు తరచుగా జీవనశైలి కారకాలతో ముడిపడి ఉంటాయి. ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా ఈ క్యాన్సర్ ను రాకుండా అడ్డుకోవచ్చు. వ్యక్తులు తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు’ అని చెప్పారు.

పొగాకు వాడకం

తల, మెడ క్యాన్సర్లకు పొగాకు ప్రధాన ప్రమాద కారకం. ధూమపానం చేసే వారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా పెరుగుతుంది. పొగలేని పొగాకు ఉత్పత్తులు కూడా తల, మెడ ప్రాంతంలోని కణాల డిఎన్ఎను దెబ్బతీసే క్యాన్సర్ కారకాలను కలిగి ఉంటాయి. కాబట్టి వెంటనే ధూమపానం మానేయండి. ఇది తల, మెడ క్యాన్సర్ ను మాత్రమే కాదు అనేక రకాల క్యాన్సర్లకు కారణం అవుతుంది.

మద్యపానం

అధికంగా మద్యం సేవించడం వల్ల తల, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పొగాకు వాడకంతో వల్ల ఇంకా అనేక క్యాన్సర్లు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల నోరు, గొంతు పొరల్లోకి కార్సినోజెన్ల శోషణను పెరిగిపోతుంది.

తల, మెడ క్యాన్సర్ కు చికిత్స చేసేందుకు శస్త్ర చికిత్స, రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ వంటి వాటి వల్ల క్యాన్సర్ తగ్గే అవకాశం ఉంటుంది. మెడలో గడ్డ ఏర్పడడం, దీర్ఘకాలివంగా దగ్గు, బరువు హఠాత్తుగా తగ్గడం, తలనొప్పి, ముఖానికి తిమ్మిరి, మింగడంలో కష్టంగా అనిపించడం వంటివన్నీ కూడా ఇబ్బంది పెడతాయి. ప్రస్తుతం మనదేశంలో క్యాన్సర్ రోగుల్లో 26 శాతం మందికి తల, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి.

మొదటిదశలోనే తల, మెడ క్యాన్సర్ ను గుర్తిస్తే మంచిది. ప్రాథమిక దశలోనే ఈ క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్స సులువైపోతుంది.

Whats_app_banner