Chanakya Niti Telugu : స్త్రీలు ఈ ఆరు చెడు అలవాట్లను కచ్చితంగా వదిలేయాలి.. లేకుంటే అంతే!
Chanakya Niti On Women : చాణక్య నీతిలో స్త్రీ జీవితం గురించి ఆచార్య చాణక్యుడు చాల విషయాలు చెప్పాడు. స్త్రీలకు ఉండే అలవాటుతో కుటుంబానికి సమస్యలు వస్తాయని పేర్కొన్నాడు.
మానవ జీవిత శ్రేయస్సు కోసం చాణక్యుడు అనేక సలహాలు ఇచ్చాడు. తన జ్ఞానాన్ని, అనుభవాన్ని చాణక్య నీతి ద్వారా చెప్పాడు. చాణక్యుడి సూత్రాలు మానవ జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు చెబుతాయి. చాణక్య నీతి అన్ని కాలాలకు సంబంధించినది. ఇప్పటికీ దానిని ఫాలో అయ్యేవారు ఉన్నారు.
చాణక్యుడి సూత్రాలను జీవితంలో సరిగ్గా ఉపయోగించుకోవాలి. వీటిద్వారా ఒక వ్యక్తి అనేక సమస్యలను నివారించవచ్చని నమ్ముతారు. చాణక్య నీతిలో చాణక్యుడు స్త్రీల కొన్ని ప్రమాదకరమైన లక్షణాలను పేర్కొన్నాడు. చాణక్య నీతి ప్రకారం మహిళలు ఎప్పుడూ దూరంగా ఉండవలసిన చెడు లక్షణాలు ఏంటో చూద్దాం.. వాటిని మహిళలు కచ్చితంగా వదులుకోవాలి.
అహం పెద్ద శత్రువు
అహం అనేది జీవితంలో పెద్ద శత్రువు. చాణక్యుడి ప్రకారం స్త్రీలు అహంభావానికి దూరంగా ఉండాలి. అహం ఉన్న స్త్రీ ఇంచికి మంచిది కాదు. అహం వదిలిపెడితే.. ఆనందం, అదృష్టం ప్రారంభమవుతుంది. అహం ఉన్నవారి ఇంట్లో నివసించడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అందుకే చాణక్యుడు స్త్రీలకు అహంకారాన్ని అత్యంత ప్రమాదకరమైన గుణంగా పేర్కొన్నాడు.
అజ్ఞానంగా ఉండకూడదు
అజ్ఞానం చెడ్డ గుణం కాదు, లోపం. చాణక్యుడు ప్రకారం స్త్రీకి తెలివితేటలు చాలా ముఖ్యం. ఎందుకంటే కుటుంబం, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. విద్యావంతులు, అవగాహన ఉన్న మహిళలు ఈ సమాజానికి దిశానిర్దేశం చేస్తారు. విద్యావంతురాలు, విజ్ఞానం ఉన్న స్త్రీ ఇంటిని స్వర్గంగా మార్చగలదు. అమాయకులైన మహిళలు తమ సంక్షేమం కోసం లేదా ఇతరుల సంక్షేమం కోసం ఏమీ చేయలేరు.
ఎక్కువగా కోపం
కోపం చూపించడం మనుషులందరికీ అలవాటే. అయితే ప్రతి విషయంలోనూ మహిళలు కోపగించుకోవడం మంచిది కాదు. అన్ని విషయాలపై కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు అవతలి వ్యక్తి మీపై చాలా కోపంగా ఉంటారు. మీరు చాలా పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.
అతిగా స్వార్థం
స్త్రీ తన జీవితాన్ని గడపడమే కాకుండా మొత్తం కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి కూడా ఆలోచించాలి. ఇది అన్ని ఇళ్లలోనూ ఉండదు. కొంతమంది మహిళలు కుటుంబ బాధ్యతను భారంగా భావిస్తారు. కొంతమందికి డబ్బు, ఆస్తుల విషయంలో స్వార్థం ఎక్కువ. స్త్రీల ఇటువంటి ప్రవర్తన ఉంటే కుటుంబం బాగుపడదని చాణక్య నీతి చెబుతుంది.
దురాశ ఎక్కువగా ఉండటం
చాణక్య నీతి ప్రకారం స్త్రీలు ఎప్పుడూ దురాశకు దూరంగా ఉండాలి. ఈ ప్రవర్తన కుటుంబాన్ని పాడు చేస్తుంది. చాణక్యుడు ప్రకారం ఒక స్త్రీ అత్యాశకు గురైతే ఆమె ఇంటి ఆనందాన్ని, శాంతిని నాశనం చేయడాన్ని ప్రారంభిస్తుంది. దురాశ కుటుంబంలో అస్థిరతను కలిగిస్తుంది.
అబద్ధాలు చెప్పే అలవాటు
చాణక్య నీతి ప్రకారం, చాలా మంది స్త్రీలు అబద్ధం చెప్పే ధోరణితో ఉంటారు. అబద్ధాలు చెప్పడం లేదా మోసం చేయడం మాత్రమే కాదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం కూడా మంచిది కాదు. ఈ అలవాట్లు ఏదో ఒక రోజు వారి జీవితాలను మరింత దిగజార్చుతాయి. ఈ స్త్రీలకు ఇతరుల నుండి గౌరవం దొరకదు.