(1 / 5)
అంతర్జాతీయ విత్తన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ గ్రామంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం విత్తనాల సంరక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విత్తనాల ప్రదర్శనతో మహిళా రైతులు ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
(2 / 5)
ఈ కార్యక్రమంలో 25 గ్రామాలకు చెందిన 43 మంది విత్తన సంరక్షకులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో 80 రకాల దేశీ విత్తనాలను ప్రదర్శించారు. ఎర్ర పెసరి, నల్ల తొగరి, బురఖ తొగరి, పచ్చ సెనగలు, నల్ల బెబ్బరి వంటి అంతరించిపోతున్న విత్తన రకాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
(3 / 5)
ఎన్నో రకాల పురాతనమైన విత్తనాలను సంరక్షిస్తున్నామని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళా సభ్యురాలు వెల్లడించారు. తమ చిన్న తనంలో ఇంటికి అవసరమైన అన్ని పంటలు తమ పొలంలోనే పండించేవాళ్లమని, ఇప్పటి రైతులు ఒకటి లేదా రెండు పంటలు మాత్రమే ప్రధానంగా సాగు చేస్తున్నారని మహిళలు తెలిపారు.
(4 / 5)
తమ దగ్గర ఉన్న విత్తనాలను ఇతర మహిళలతో పంచుకుంటామని, తమ దగ్గర లేని విధానాలను ఇతర మహిళలనుండి తీసుకుంటామని మహిళలు తెలిపారు.
(5 / 5)
ఎర్ర పెసరి,నల్ల తొగరి, బురఖ తొగరి, పచ్చ సెనగలు,నల్ల బెబ్బరి వంటి అంతరించిపోతున్న విత్తన రకాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విత్తనాలను సంరక్షించడంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళా సభ్యుల కృషిని అధికారులు అందరు కొనియాడారు.
ఇతర గ్యాలరీలు