Warming Winter Teas । చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచే చాయ్ వెరైటీలు ఇవే!-winter tea varieties that keep you warm and healthy during cold season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Warming Winter Teas । చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచే చాయ్ వెరైటీలు ఇవే!

Warming Winter Teas । చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచే చాయ్ వెరైటీలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Aug 03, 2024 10:03 PM IST

Warming Winter Teas: చలికాలంలో చాయ్ తాగకుండా ఉండలేం. అయితే మనకు టీలలో చాలా రకాలు ఉన్నాయి, వీటిలో చలికాలం మీ ఆరోగ్యానికి మేలు చేసే టీ రకాలు, వాటి రెసిపీలు ఇక్కడ చూడండి.

Warming Winter Teas
Warming Winter Teas (Unsplash)

Warming Winter Teas: చలికాలంలో చల్లని సాయంత్రాన ఒక కప్పు వేడి టీ తాగడం కంటే ఓదార్పునిచ్చేది మరొకటి లేదు. వణికించే చలిలో తాజాగా తయారుచేసిన కప్పు టీ మీ శరీరానికి వెచ్చదనాన్ని అందించడమే కాకుండా అనేక మార్గాల్లో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దగ్గు, జలుబుల నుంచి ఉపశమనం కలిగించడం దగ్గర్నించీ రోగనిరోధక శక్తిని పెంచడం , శరీరాన్ని నిర్విషీకరణ చేయడం, జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడం వరకు అన్ని సమస్యలను సింగిల్ టీ పరిష్కరిస్తుంది.

అయితే మనకు టీలలో చాలా వెరైటీలు, ఫ్లేవర్లు అందుబాటులో ఉంటాయి. మరి ఈ చలికాలంలో ఎలాంటి టీ మిమ్మల్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుందో, ఆ టీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా?

నిమ్మకాయ మిరియాల టీ

ఈ చాయ్ కొంచెం పుల్లగా, కొంచెం కారంగా ఉంటుంది. ఈ టీ తాగితే మీ శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి, రక్తపోటును తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఈ టీ తయారీ కోసం, ఒక కప్పు నీటిని మరిగించండి. అందులో ఒక నిమ్మకాయ రసం, 1/4 టీస్పూన్ నల్ల మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసి 3-4 నిమిషాలు ఉడకనివ్వండి. ఆపైన ఒక కప్పులో పోసుకొని, ఒక టీస్పూన్ తేనె కలిపి తాగాలి.

అశ్వగంధ చాయ్

అశ్వగంధ మీ రోగనిరోధక శక్తికి ఉపయోగకరంగా ఉండటమే కాకుండా రక్తంలో చక్కెరను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. అంతేకాదు, మీ ఒత్తిడి, ఆందోళనను సైతం ఈ టీ తగ్గిస్తుంది. ఈ హెర్బల్ టీ కోసం, మీకు కావలసిందల్లా 3-4 అంగుళాల అశ్వగంధ వేరు ముక్క. టీ తయారీ కోసం ఒక పాన్‌లో ఒక కప్పు నీటిని తీసుకొని అందులో అధ్వగంధ వేరును వేసి 10-15 నిమిషాలు మరిగించండి. పూర్తయిన తర్వాత, వడకట్టి, అందులో 1 స్పూన్ తేనె కలపండి. రుచికరమైన టీని ఆస్వాదించండి.

అల్లం-పుదీనా చాయ్

చలికాలంలో అల్లం తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది రక్తాన్ని క్లియర్ చేస్తుంది, శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, జలుబు లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనికి అదనంగా పుదీనా జోడిస్తే, ఇది మీ టీకి ఫ్లేవర్ ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియలో సహాయపడుతుంది.

క్లాసిక్ మసాలా చాయ్

ఇది మనం రెగ్యులర్‌గా తాగే చాయ్. క్లాసిక్ మసాలా చాయ్ తయారీకి, 2 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క, 2 మిరియాలు, 2 పచ్చి ఏలకులను కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి ఇందులో టీపొడి వేసి మరిగించాలి. ఆపైన పాలు, చక్కెర, దంచుకున్న మసాలా పొడి వేసి మరిగించాలి. ఆ తర్వాత చాయ్‌ను వడకట్టి, వేడిగా ఆస్వాదించండి.

Whats_app_banner

సంబంధిత కథనం