Fennel Tea Health Benefits । ఈ ఒక్క టీ తాగితే బీపీ, షుగర్ రెండూ కంట్రోల్‌లో ఉంటాయి!
Fennel Tea Health Benefits: సోంఫ్ విత్తనాలతో టీ చేసుకొని తాగటం వలన మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఫెన్నెల్ టీ ఎలా చేసుకోవాలి? ఏమేం లాభాలుంటాయో ఇక్కడ తెలుసుకోండి.
మంచి విందు భోజనం తర్వాత ఒక చెంచా సోంఫ్ వేసుకొని నములుతుంటే ఆనందంగా ఉంటుంది. అయితే ఈ సోంఫ్ మీ ఆరోగ్యానికి సంబంధించిన అనేక రకాల సమస్యలను పరిష్కరించగలదని మీకు తెలుసా? సోంఫ్ విత్తనాలు తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. అంతేకాదు సరైన విధానంలో రోజూ తీసుకోవడం వలన మీ జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది, రక్తహీనత, అజీర్ణం, అపానవాయువు, మలబద్ధకం, అతిసారం, పీరియడ్స్ నొప్పుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
సోంఫులో పొటాషియం, మాంగనీస్, జింక్, ఐరన్, రాగి వంటి మినరల్స్ ఉంటాయి. ఇంకా ఇందులోని యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు కడుపు ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరాన్ని లోపలి నుంచి చల్లగా ఉంచడం ద్వారా ఎసిడిటీ, శరీర దుర్వాసన, నోటి దుర్వాసన వంటి సమస్యలను నివారిస్తుంది. అంతే కాదు, సోంఫు విత్తనాలతో టీ చేసుకొని తాగితే జలుబు, దగ్గు లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు.
How To Make Fennel Tea- ఫెన్నెల్ టీ ఎలా తయారు చేయాలి?
సోంఫ్ విత్తనాలతో గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు పొందేలా సోంఫ్ టీ లేదా ఫెన్నెల్ టీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
ఫెన్నెల్ టీ చేయడానికి, ముందుగా గిన్నెలో 1 కప్పు నీటిని వేడి చేసి, ఆపై స్టవ్ ఆఫ్ చేసి, అందులో 1 టీస్పూన్ సోంఫ్ గింజలను వేయండి. సోంఫ్ వేసిన తర్వాత నీటిని మరిగించవద్దని గుర్తుంచుకోండి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉంచితే, నీరు పసుపు రంగులోకి మారుతుంది. ఇదే ఫెన్నెల్ టీ, దీనిని రోజుకు 2 సార్లు త్రాగాలి.
Fennel Tea Health Benefits - ఫెన్నెల్ టీ ఆరోగ్య ప్రయోజనాలు
ప్రతిరోజూ పరిమిత మోతాదులో ఫెన్నెల్ టీ తాగటం వలన కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.
బరువు తగ్గడానికి
ఫెన్నెల్ టీ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మీకు మరింత ఆకలిని తగ్గిస్తుంది. ఈ రకంగా మీరు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఫెన్నెల్ టీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో మేలు చేస్తుంది. గుండె జబ్బులు అదుపులో ఉంటాయి.
పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం
గోరువెచ్చని ఫెన్నెల్ టీ తాగడం వల్ల పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో తిమ్మిరిగా ఉన్నప్పుడు ఒక కప్పు ఫెన్నెల్ టీని త్రాగవచ్చు. ఇంకా ఈ ఫెన్నెల్ టీలో ఉండే మెగ్నీషియం కారణంగా, ఇది మీ నిద్రను మెరుగుపరుస్తుంది, నిద్రలేమి సమస్యను తొలగిస్తుంది.
అధిక రక్తపోటు నియంత్రణకు
అధిక రక్తపోటు, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఫెన్నెల్ టీ ప్రభావవంతంగా ఉంటుంది. ఈ టీలోని పోషక గుణాలు హైబీపీని తగ్గించగలవు. కొన్ని అధ్యయనాలు ప్రకారం, ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలోనూ సహాయపడుతుంది.
డీహైడ్రేషన్ ఉండదు
వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఫెన్నెల్ టీ చాలా సహాయపడుతుంది. సోంఫులో ఉండే కూలింగ్ ఏజెంట్లు, హైడ్రేటింగ్ గుణాలు మీ శరీరాన్ని చల్లగా అలాగే హైడ్రేట్ గా ఉంచుతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం అంతర్జాలంలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడికరించి ఇచ్చినది. ఏదైనా పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోండి.
సంబంధిత కథనం