Coconut Shell Tea । కొబ్బరిచిప్పలో చాయ్.. కొత్తగా ఇలా ట్రై చెయ్!
Coconut Shell Tea: కొబ్బరిచిప్పలోని కొబ్బరి తిని చిప్ప పాడేస్తున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఇక నుంచి చిప్పను దాచుకొని అందులో టీ కాచుకొని తాగి చూడండి. ఎందుకో ఇక్కడ తెలుసుకోండి.
భోజనంను ప్లేట్లలో కాకుండా అరటి ఆకుల్లో, ఇస్తారి ఆకులో తినడం వల్ల ఆరోగ్యకరం అని మనందరికీ తెలుసు. సాధారణ లోహ పాత్రల్లో వండిన భోజనం కంటే మట్టికుండలో వండిన భోజనం రుచిగా ఉంటుందని చెప్తారు. అలాగే బొంగులో చికెన్, దొన్నెలో బిర్యానీ, మురికి అన్నం, జంబలకిడి జారు మిఠాయి వంటివి కొన్ని రోజుల పాటు ఇంటర్నెట్లో ట్రెండ్ అయ్యాయి, ఇందులో కొన్ని ఇప్పటికీ ప్రజాదరణ కలిగి ఉన్నాయి. ఇప్పుడు కొబ్బరిచిప్పలో చాయ్ అనేది నెట్టింట్లో ఉడుకుతోంది.
మీరు కొబ్బరిచిప్పలో కొబ్బరి తినేసి చిప్పను పాడేస్తున్నట్లయితే ఇక నుంచి అలా చేయకండి, వాటిని భద్రంగా దాచుకోండి. ఎందుకంటే అందులోనే టీ కాచుకోవచ్చు. కొబ్బరిచిప్పల్లో వండిన అన్నం, కూరలు, పాయసం ఇలా ఏది వండినా కూడా రుచికరంగా ఉంటుందట.
కొబ్బరిచిప్పలో పీచుపదార్థంతో పాటుగా విటమిన్లు A, D, E, K లు ఉంటాయి. ఇందులో ఆహారపానీయాలను ఉడికించుకొని తింటే అదనంగా ఈ పోషకాలు కూడా శరీరానికి అందుతాయి, ఇవి మీ ప్రేగు కదలికలను మెరుగుపరుస్తాయి, జీర్ణవ్యవస్థకు మంచిది. అంతేకాకుండా ఇవి పర్యావరణ హితమైనవి అని అంటున్నారు.
ఇప్పుడు కొబ్బరిచిప్పలో టీ చేసుకొనే ట్రెండ్ మళ్లీ మొదలైంది. మరి ఈ చిప్పలో చాయ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుందామా?
Coconut Shell Tea Recipe- Ingredients
1 కొబ్బరి చిప్ప
1/4 టీస్పూన్ టీ పౌడర్
1/2 టీస్పూన్ చక్కెర
1-2 ఏలకులు
1/2 కప్పు పాలు
అవసరమైనన్ని నీళ్లు
కొబ్బరిచిప్పలో టీ తయారుచేసే విధానం
- ముందుగా రంధ్రాలు లేని ఒక కొబ్బరి చిప్పను తీసుకోండి. దానిని శుభ్రంగా కడగండి.
- ఈ చిప్పలో పాలు, నీళ్లు పోసి తక్కువ మంట మీద వేడిచేయండి.
- పాలు ఉడకటం ప్రారంభమయ్యాక టీ ఆకులు, చక్కెర, యాలకులు వేసి మరిగించండి.
- పొంగకుండా కలుపుతూ ఉండండి, చాయ్ సిద్ధం అవుతుంది.
అంతే, ఇద్ది కొబ్బరిచిప్పలో టీ.. మీరు చేసుకొని తాగి చూడండి.
సంబంధిత కథనం