Dirty Dirty Rice | మురికి రైస్ తింటారా? పేరుకే డర్టీ రైస్ కానీ రుచిలో అదుర్స్!-dirty dirty rice have it in lunch or dinner check recipe here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Dirty Dirty Rice Have It In Lunch Or Dinner, Check Recipe Here

Dirty Dirty Rice | మురికి రైస్ తింటారా? పేరుకే డర్టీ రైస్ కానీ రుచిలో అదుర్స్!

HT Telugu Desk HT Telugu
Jul 28, 2022 08:03 PM IST

డిన్నర్ కోసం అన్నం కాస్త వెరైటీగా వండుకోవాలనుకుంటున్నారా? అయితే డర్టీ డర్టీ రైస్ తినండి. ఇది ఎంతో టేస్టీగా, ఫ్లేవర్ ఫుల్ గా ఉంటుంది. కామెడీ కాదు, రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.

Dirty Rice
Dirty Rice (Istock)

మనం సాధారణంగా భోజనంలో ఎక్కువగా అన్నమే తింటాము. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అందరూ అన్నం వండుకుంటారు. మామూలు వైట్ రైస్ కాకుండా అప్పుడప్పుడు బిర్యానీ, పులావు, లెమన్ రైస్, ఖిచ్డీ, దద్దోజనం, ఫ్రైడ్ రైస్ ఇలా పలురకాల వెరైటీలు చేసుకొని తింటాము. కానీ మీరు ఎప్పుడైనా 'డర్టీ రైస్' అంటే మురికి అన్నం తిన్నారా? ఇక్కడ మురికి అన్నం అంటే పాచిపోయిన అన్నం లేదా కలుషితమైన అన్నమో కాదు. ఈ వంటకం పేరే 'డర్టీ, డర్టీ రైస్'.

అవును, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇలాంటి ఒక వంటకం అనేది ఉంది. దీనినే 'కాజున్ రైస్' లేదా 'రైస్ డ్రెస్సింగ్' అని కూడా పిలుస్తారు. అమెరికాలోని లూసియానా, మెక్సికో లాంటి ప్రాంతాలలో ఈ డర్టీ రైస్ ఎక్కువగా తీసుకుంటారు. మీరూ తినాలనుకుంటే దేశీ స్టైల్లో ఎలా చేసుకోవాలో కింద రెసిపీ ఇచ్చాం చూడండి.

కావలసిన పదార్థాలు

  • 1 కప్పు బాస్మతి బియ్యం
  • 1 టేబుల్ స్పూన్ వెన్న
  • 1 ఉల్లిపాయ
  • 1⁄4 కప్పు జీడిపప్పు
  • 1 కప్పు ఫ్రిజ్ బఠానీలు
  • 1 అంగుళం దాల్చిన చెక్క
  • 4-5 మిరియాలు
  • 3 ఏలకులు
  • 1 బిరియానీ ఆకు
  • 1 1⁄2 కప్పు చికెన్ ఉడకబెట్టిన నీరు

తయారీ విధానం

  1. ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి పక్కనపెట్టుకోండి.
  2. మరొక గిన్నెను వేడి చేసి, మీడియం మంట మీద వెన్న కరిగించండి.
  3. వేడి చేసిన వెన్నలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేపుకోవాలి. అనంతరం జీడిపప్పు, దాల్చిన చెక్క, మిరియాలు, ఏలకులు, బిరియానీ ఆకు వేపుకోవాలి. ఆపై బఠానీలు కూడా వేపుకోవాలి.
  4. ఇప్పుడు కడిగిన బాస్మతి బియాన్ని వేసి కలపాలి. అనంతరం చికెన్ వేడిచేసిన నీటిని పోసి అన్నం ఉడికించుకోవాలి.
  5. ఉడికించిన అన్నంలో నుంచి మిరియాలు, చెక్కలాంటి మసాల దినుసులు తొలగించి, పైనుంచి కొత్తిమీర గార్ని చేసుకోవాలి.

అంతే, డర్టీ డర్టీ రైస్ సిద్ధం అయింది, వేడివేడిగా ఆరగించటమే.

డర్టీ రైస్ పేరు ఎందుకు వచ్చింది?

పైన రెసిపీ బాగానే ఉంది కదా మరీ డర్టీ రైస్ పేరు ఎందుకు అనేగా మీ డౌట్. అసలైన క్లాసిక్ డర్టీరైస్ లో వేసే అతి ముఖ్యమైన పదార్థాలు ఇందులో వేయలేం. అవేంటంటే క్లాసిక్ డర్టీ రైస్ కోసం ఎముకలు లేని లేత పందిమాసం, కోడి కాలేయం చిన్న ఖీమాలాగా కట్ చేసుకొని, వెన్నలో వేడి చేసి ఆపై అన్నంగా వండుకోవాలి. ఇవి రెండూ కలిపినపుడు ఆ అన్నానికి ముదురు గోధుమ రంగు వస్తుంది. కాబట్టి ఆ రంగు వారికి నచ్చకపోవటంతో దీనికి డర్టీ, డర్టీ రైస్ అనే పేరు వచ్చింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్