Green Tea Cleansing Mask : గ్రీన్ టీ క్లెన్సింగ్ మాస్క్.. దీనితో మీ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్
Green Tea Cleansing Mask : పెరిగిన కాలుష్యం, వాతావరణంలోని మార్పుల కారణంగా.. మీ ముఖంపై మొటిమలు, మచ్చలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటివి మొహంలోని అందాన్ని కబలిస్తాయి. అయితే వీటిని వదిలించుకోవడంలో గ్రీన్ టీ మీకు ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది అని మీకు తెలుసా? గ్రీన్ టీ అనగానే తాగడం గురించి అనుకున్నారేమో.. కానీ కాదు.
Green Tea Cleansing Mask : ఎవరైనా గ్రీన్ టీ గురించి మాట్లాడితే.. మీరు వెచ్చని కప్పు టీ గురించి ఆలోచిస్తారు. అయితే దాని ప్రయోజనాలు ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కాదు.. స్పష్టమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని తక్షణమే అందించే అనేక చర్మ సంరక్షణ ప్రయోజనాలను అందిస్తుంది గ్రీన్ టీ. దానిని సమయోచితంగా ఉపయోగించినప్పుడు.. దాని ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. మీ చర్మ సంరక్షణలో భాగంగా మీరు గ్రీన్ టీ క్లెన్సింగ్ మాస్క్‌ని హ్యాపీగా ట్రై చేయవచ్చు.
ఎందుకంటే దీనిలో పాలీఫెనాల్స్, కాటెచిన్‌లు, కెఫిన్, టానిన్లు, విటమిన్లు A, B2,E, ఎపిగాల్లోకాటెచిన్-3-గాలేట్ వంటి క్రియాశీల సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్‌లను కలిగి ఉంటుంది. ఇది చర్మానికి రక్షణ ఇస్తుంది. దాదాపు అన్ని చర్మ రకాలకు సరిపోయే కొన్ని సహజ ఉత్పత్తులలో ఇది కూడా ఒకటి. కాబట్టి దీనిని మీరు మీ రోజువారీ చర్మ సంరక్షణలో ఉపయోగించవచ్చు.
ప్రయోజనాలు
ఇది చర్మపు మంటను అణిచివేస్తుంది. సోరియాసిస్, డెర్మటైటిస్, రోసేసియా వంటి మొదలైన వైద్య చర్మ పరిస్థితుల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌తో సహా మొటిమలను నివారిస్తుంది. వాటికి చికిత్స ఇస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని క్లియర్ చేస్తుంది. ఎక్స్‌ఫోలియేషన్ వల్ల చనిపోయిన చర్మ కణాలను సున్నితంగా తొలగిస్తుంది. కొత్త చర్మ కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. చర్మం నుంచి అదనపు నూనె, మురికిని తొలగిస్తుంది. సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ముడతలు వంటి అకాల వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేసి మంచి పోషణ ఇస్తుంది.
గ్రీన్ టీ క్లెన్సింగ్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలంటే..
గ్రీన్ టీ క్లెన్సింగ్ మాస్క్ కోసం.. ఉపయోగించిన గ్రీన్ టీ బ్యాగ్ లేదా 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ తీసుకోవాలి. దానిని వేడి నీటిలో వేసి సుమారు పది నిమిషాలు ఉంచి.. టీ ఆకులను వడకట్టేయాలి. ఆ నీటిలో 2 టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి.
ఎలా అప్లై చేయాలంటే..
* మీ ముఖాన్ని శుభ్రం చేసి ఆరనివ్వండి.
* వెంట్రుకలు, కళ్ల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తప్పించుకుంటూ మీ ముఖంపై మాస్క్‌ను అప్లై చేయండి.
* 10-15 నిమిషాలు ఆరనివ్వండి.
* మెత్తగా ఎక్స్‌ఫోలియేట్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి.
అలెర్ట్
పొడి చర్మం ఉన్నవారు బేకింగ్ సోడా వాడకుండా ఉండాలి. అలాగే మీరు సూర్యరశ్మికి దూరంగా శుభ్రమైన, పొడి ప్రదేశంలో గ్రీన్ టీని నిల్వ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్