Ugadi 2024 : ఉగాది రోజున ఆరు రుచులను ఎందుకు తీసుకోవాలి?-why to eat 6 types of taste on ugadi festival must know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ugadi 2024 : ఉగాది రోజున ఆరు రుచులను ఎందుకు తీసుకోవాలి?

Ugadi 2024 : ఉగాది రోజున ఆరు రుచులను ఎందుకు తీసుకోవాలి?

Anand Sai HT Telugu
Apr 07, 2024 02:00 PM IST

Ugadi 2024 : ఉగాది అనగానే మెుదటగా గుర్తుకు వచ్చేది.. ఉగాది పచ్చడి. ఇది లేకుండా పండుగ ఉండదు. అయితే ఉగాది షడ్రుచులు ఎందుకు చూడాలి?

ఉగాది పచ్చడి అర్థం
ఉగాది పచ్చడి అర్థం (Unsplash)

ఉగాది పచ్చడి లేకుండా ఉగాది మెుదలుకాదు. కచ్చితంగా ఉగాది నాడు.. ఆ పచ్చడి తినాల్సిందే. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఆరు రుచులను చూడటం వెనక కొన్ని విధాలు ఉన్నాయి. వాటి గురించి కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఉగాది నాడు తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరును రుచి చూస్తారు. ఇది లేకుండా ఉగాది అనేది ఉండదు. ఈ షడ్రుచులను కుటుంబ సభ్యులంతా పచ్చడి రూపంలో తీసుకుంటారు.

ఒక్కో రుచి ఒక్కో అనుభూతిని ఇస్తుంది. ఆ రుచులకు వేరు వేరు అర్థాలు ఉంటాయి. జీవితంలోని ప్రతీ విషయంతో షడ్రుచులు ముడిపడి ఉంటాయి. ఉగాది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే కొత్త సంవత్సరం తొలి రోజు. తొలి పండుగ కూడా. తెలుగువారికి తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం అన్నమాట. ఇది చాలా ప్రత్యేకమైనది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాం. ఈ ఉగాదిలో షడ్రుచుల రుచి చూడాలి. ఆ రుచులు జీవితంలోని కోణాల గురించి చెబుతాయి. అందుకే ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులను కలుపుతారు.

వేప చేదు రుచిని చూపిస్తుంది. వేప ఒక ఔషధ గుణాలు ఉన్న చెట్టు. దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీవితంలో స్వచ్ఛమైన చేదు కూడా ఉంటుంది. దానిని భరించాలి, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాలి. అప్పుడే జీవితం మధురంగా ​​ఉంటుంది. జీవితం బాగుంటుంది అనే భావాన్ని ఈ రుచి సూచిస్తుంది.

ఉగాది పచ్చిడిలో బెల్లం కలుపుతారు. జీవితంలో సంతోషంగా ఉండాలని ఇది చెబుతుంది. ఈ బెల్లం అనేది తియ్యని రుచి. కష్టాల తర్వాత ఆనందం వస్తుందని, నొప్పి తగ్గుతుందని, ఆనందం పెరుగుతుందని ఆశను తెలియజేస్తుంది. మనం మార్పును స్వీకరించాలి. చిరునవ్వుతో జీవితాన్ని అంగీకరించాలి అనే భావన కలిగిస్తుంది.

కొందరు ఉగాది పచ్చడిలో కారం వేస్తారు.. మరికొందరు బ్లాక్ పెప్పర్ ఉపయోగిస్తారు. ఇది కోపాన్ని సూచిస్తుంది. ప్రతి మనిషిలో కోపం ఉంటుంది. కోపం ఉండాలి అంటారు కానీ తక్కువ ఉంటే మంచిది. కోపంతో ఏ పని చేసినా ఇబ్బంది కలుగుతుంది. కోపం తగ్గితే జీవితం చాలా బాగుంటుందని ఈ రుచి వివరిస్తుంది.

ఉప్పు లేకుండా వంట చేయడం అనేది కష్టం. ఉప్పు భయాన్ని సూచిస్తుంది. ఏదైనా పని చేసేటప్పుడు కొంత భయం ఉండాలి. తగినంత భయం లేని చోట, ఒక వ్యక్తి తప్పు చేసినట్లు చెబుతారు. ఒక వ్యక్తి తన జీవితంలోని ప్రతిదీ ఉప్పుగా భావిస్తే, జీవితం అందంగా ఉంటుందని అంటారు.

పుల్లటి చింతపండు అద్భుతమైన జీర్ణశక్తిని కలిగించే ఆహారం. ఇది తెలియజేసే వాస్తవం ఏమిటంటే ఒక వ్యక్తి తన జీవితంలో వచ్చే అన్ని విషయాలను లేదా పరిస్థితులను తగిన విధంగా అంగీకరించడం ద్వారా జీర్ణించుకోవాలి. మీకు ఈ రకమైన గుణం ఉంటే మీరు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు.

మామిడి ఆశ్చర్యానికి చిహ్నం. వేప బెల్లం కలిపితే మామిడి రుచి సూపర్ గా ఉంటుంది. అలాగే జీవితంలోని కొన్ని ఆశ్చర్యాలు జీవితాన్ని మరింత అందంగా మారుస్తాయి. అందుకే వగరు రుచిని ఉగాది పచ్చడిలో కలుపుతారు.

Whats_app_banner