Kurchi Madathapetti Song: గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ క్రేజ్ మామూలుగా లేదు.. ఎన్‌బీఏ మ్యాచ్ మధ్యలో..-guntur kaaram kurchi madathapetti song played in an nba match mahesh babu sreeleela song creates sensation ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kurchi Madathapetti Song: గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ క్రేజ్ మామూలుగా లేదు.. ఎన్‌బీఏ మ్యాచ్ మధ్యలో..

Kurchi Madathapetti Song: గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ క్రేజ్ మామూలుగా లేదు.. ఎన్‌బీఏ మ్యాచ్ మధ్యలో..

Hari Prasad S HT Telugu

Kurchi Madathapetti Song: గుంటూరు కారం మూవీలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ క్రేజ్ ఖండాంతరాలు దాటేసింది. ఈ సాంగ్ ను ఏకంగా ఎన్‌బీఏ మ్యాచ్ మధ్యలో ప్లే చేయడం విశేషం.

గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ క్రేజ్ మామూలుగా లేదు.. ఎన్‌బీఏ మ్యాచ్ మధ్యలో..

Kurchi Madathapetti Song: మహేష్ బాబు, శ్రీలీల డ్యాన్స్ తో ఇరగదీసిన గుంటూరు కారం మూవీలోని కుర్చీ మడతపెట్టి పాటకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సాంగ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికాలోనూ ఓ ఊపు ఊపేస్తోంది. ఈసారి ఏకంగా నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) మ్యాచ్ మధ్యలో ఈ సాంగ్ ప్లే చేయడం, దానిపై అక్కడి డ్యాన్సర్లు స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది.

ఎన్‌బీఏ మ్యాచ్‌లో కుర్చీ మడతపెట్టి..

సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం మూవీలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో మనకు తెలుసు. మాస్ బీట్, అందుకు తగినట్లుగా మహేష్, శ్రీలీల ఊరమాస్ స్టెప్స్ థియేటర్లలో ప్రేక్షకులను కేరింతలు కొట్టేలా చేశాయి. అయితే ఈ పాట ఇక్కడే కాదు.. అమెరికానూ ఊపేస్తున్నట్లు తాజాగా ఘటనతో తేలిపోయింది.

అమెరికాలోని హూస్టన్ నగరంలోని టొయోటా సెంటర్లో జరుగుతున్న గేమ్ మధ్యలో ఈ పాట ప్లే చేశారు. ఓ ఎన్‌బీఏ మ్యాచ్ లో ఈ పాట ప్లే చేస్తున్న వీడియోను గుంటూరు కారం మూవీ టీమ్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్లో సోమవారం (ఏప్రిల్ 1) పోస్ట్ చేసింది. "ప్రపంచవ్యాప్తంగా కుర్చీ మడతపెట్టి మానియా విస్తరిస్తోంది. మహేష్ బాబు ఎలక్ట్రిఫయింగ్ కుర్చీ మడతపెట్టి పాట హూస్టన్ లోని టొయోటా సెంటర్లో జరుగుతున్న ఎన్‌బీఏ గేమ్ హాఫ్ టైమ్ లో సెగలు పుట్టించింది" అనే క్యాప్షన్ తో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో మన ఇండియన్ డ్యాన్సర్లు బాస్కెట్ బాల్ కోర్టు మధ్యలో కుర్చీ మడతపెట్టి పాటపై స్టెప్పులేయడం చూడొచ్చు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ మాస్ సాంగ్ ఈ ఏడాది హిట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది.

సాంగ్ ఆఫ్ ద డెకేడ్

ఎన్‌బీఏ మ్యాచ్ మధ్యలో ఈ పాట ప్లే చేయడం చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ థ్రిల్ ఫీలవుతున్నారు. ఈ వీడియో చూసిన కొందరు ఫ్యాన్స్ ఇది సాంగ్ ఆఫ్ ద డెకేడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గ్లోబల్ రీచ్ ఉండే అలాంటి బాస్కెట్ బాల్ మ్యాచ్ లో గుంటూరు కారం సాంగ్ ప్లే అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ సడెన్ సర్‌ప్రైజ్ అభిమానులను ఆనందానికి గురి చేసింది.

ఈ పాటపై నిజానికి మొదట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఓ పెద్దాయన వాడిన బూతునే పాట మొదట్లో పెట్టి మాస్ బీట్ రూపొందించడంపై సోషల్ మీడియాలో చాలా మంది విమర్శలు గుప్పించారు. అయితే మాస్ ఆడియెన్స్ మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోలేదు.

గుంటూరు కారం మూవీ స్టోరీ అభిమానులను అంతగా ఆకట్టుకోకపోయినా.. ఈ సాంగ్ మాత్రం ఓ రేంజ్ లో హిట్ అయింది. ముఖ్యంగా శ్రీలీల స్టెప్పులు బాగా ఆకట్టుకున్నాయి. ఆమె పక్కన మహేష్ కూడా గతంలో ఎప్పుడూ వేయని మాస్ స్టెప్పులు వేశాడు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సుమారు రూ.200 కోట్ల వరకూ వసూలు చేసింది.