Sreeleela: శ్రీలీల డ్యాన్సులకు అశ్విన్ బోల్డ్ - గుంటూరు కారం మూవీపై టీమిండియా క్రికెటర్ ప్రశంసలు
Sreeleela: గుంటూరు కారం మూవీపై టీమిండియా క్రికెటర్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాలో మహేష్‌బాబుతో శ్రీలీల డ్యాన్సులు అమేజింగ్‌గా ఉన్నాయని అశ్విన్ చెప్పాడు.
Sreeleela: మహేష్‌బాబు హీరోగా నటించిన గుంటూరు కారం మూవీపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాలో శ్రీలీల డ్యాన్సులు అద్భుతమంటూ అశ్విన్ చెప్పాడే. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుంటూరు కారం మూవీ చూసినట్లు అశ్విన్ చెప్పాడు. గుంటూరు కారం సూపర్ ఎంటర్‌టైనింగ్ మూవీ అని అశ్విన్ తెలిపాడు
సూపర్ ఎంటర్‌టైనింగ్ మూవీ...
గుంటూరు కారం సినిమాలో శ్రీలీల డ్యాన్స్‌తో అదరగొట్టిందని అశ్విన్ పేర్కొన్నాడు. ఆమె డ్యాన్స్ మూవ్‌మెంట్స్, స్టెప్పులు అమేజింగ్‌గా ఉన్నాయని తెలిపాడు. మహేష్‌బాబు కూడా మంచి డ్యాన్సర్ అని అశ్విన్ చెప్పాడు. గుంటూరు కారం సినిమాలోని పాటల్లో మహేష్‌బాబు, శ్రీలీల పోటీపడి డ్యాన్సులు చేశారని అశ్విన్ తెలిపాడు. అందరూ మిస్ కాకుండా చూడాల్సిన మూవీ ఇదని తెలిపాడు. గుంటూరు కారం మూవీపై అశ్విన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
హ్యాట్రిక్ కాంబో...
గుంటూరు కారం మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్, మహేష్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ఇది. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది.
త్రివిక్రమ్ అందించిన కథ, కథనాలపై విమర్శలొచ్చాయి. టాక్‌తో సంబంధం లేకుండా గుంటూరు కారం థియేటర్లలో రెండు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. గుంటూరు కారం సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించాడు.
మహేష్ యాక్టింగ్, ఎనర్జీ లెవెల్స్ సూపర్...
తల్లీకొడుకుల సెంటిమెంట్‌కు యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, పాలిటిక్స్ అంశాలను జోడించి త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీని తెరకెక్కించాడు. రమణ పాత్రలో మహేష్ యాక్టింగ్, ఎనర్జీ లెవెల్స్ బాగున్నా త్రివిక్రమ్ కథలో మాత్రం కొత్తదనం మిస్సయిందనే కామెంట్స్ బాగా వినిపించాయి.
అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురములో కథల్లో మార్పులు చేస్తూ త్రివిక్రమ్ గుంటూరు కారం కథను రాసుకున్నాడంటూ మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్‌ను ట్రోల్ చేశారుత్రివిక్రమ్ అందించిన కథ విషయంలో మహేష్ బాబు కూడా అసంతృప్తికి లోనయినట్లు ప్రచారం జరిగింది. మహేష్‌బాబు ఇంట్లో జరిగిన గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో త్రివిక్రమ్ పాల్గొనకపోవడం ఈ వార్తలను బలాన్ని చేకూర్చుంది.
అత్తారింటికి దారేది....
గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతోనే శ్రీలీల డిజాస్టర్లకు పుల్‌స్టాప్ పడింది. రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.
హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందించాడు. గుంటూరు కారం తర్వాత రాజమౌళితో మహేష్‌బాబు ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ఈ వేసవిలోనే సెట్స్‌పైకి రానుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్నాయి.ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీకి మహారాజా అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు సమాచారం.