Relationship: రిలేషన్‌షిప్ గురించి మగవారు ఎందుకు గోప్యంగా ఉంచుతారంటే? ఇంట్రస్టింగ్ రీజన్స్-why some men never admit they are in a relationship ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relationship: రిలేషన్‌షిప్ గురించి మగవారు ఎందుకు గోప్యంగా ఉంచుతారంటే? ఇంట్రస్టింగ్ రీజన్స్

Relationship: రిలేషన్‌షిప్ గురించి మగవారు ఎందుకు గోప్యంగా ఉంచుతారంటే? ఇంట్రస్టింగ్ రీజన్స్

Galeti Rajendra HT Telugu
Oct 13, 2024 09:30 AM IST

Live in Relationship: మహిళతో రిలేషన్‌షిప్‌ గురించి చాలా మంది మగవారు చెప్పడానికి ఇష్టపడరు. అలా రిలేషన్‌షిప్‌ను గోప్యంగా ఉంచడం ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి.

రిలేషన్‌షిప్
రిలేషన్‌షిప్ (Pexels )

లివింగ్ రిలేషన్‌షిప్‌ ఈరోజుల్లో చాలా కామన్ అయిపోయింది. కానీ.. ఈ రిలేషన్‌‌షిప్‌లో ఉన్నా కొంత మంది పురుషులు బహిరంగంగా ఆ బంధం గురించి చెప్పడానికి ఇష్టపడరు. భాగస్వామికి ఇది పలు సందర్భాల్లో కోపం తెప్పిస్తున్నా వాళ్లు మాత్రం కుటుంబ సభ్యులు లేదా కొలీగ్స్‌తో తమ రిలేషన్‌షిప్ గురించి చెప్పడానికి సిద్ధపడరు. అలా చెప్పకపోవడం వెనుక ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయని మానసిక నిపుణులు చెప్తున్నారు.

రిలేషన్‌షిప్‌పై నమ్మకం లేక

రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు భాగస్వామిని కొంత మంది పురుషులు పూర్తిగా నమ్మక పోవడం ఒక కారణం. భవిష్యత్తు గురించి భయపడి కొంత మంది తమ బంధాన్ని బహిర్గతం చేయరు. భాగస్వామితో కొంత కాలం ట్రావెల్ చేసిన తర్వాత వివాహ జీవితం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అందరికీ చెప్తారు. అప్పటి వరకు రిలేషన్‌షిప్‌ గురించి దాచేస్తారు.

ఓపెన్ ఆప్షన్

చాలా మంది పురుషులు ఒక ఆప్షన్‌ను ఓపెన్‌గా ఉంచుకోవాలని భావిస్తారు. దీనర్థం ఏమిటంటే.. పురుషుడు భవిష్యత్తులో తనకి సరిపోలిన మరో అమ్మాయి జీవితంలోకి రావొచ్చనే ఆశతో ఉంటాడు. ఒకవేళ తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని బహిర్గతం చేస్తే.. అప్పుడు ఆ ఆప్షన్ క్లోజ్ అవుతుంది. అందుకే రిలేషన్‌షిప్‌ను గోప్యంగా ఉంచుతాడు.

పెళ్లికి ఒత్తిడి తెస్తారని

ఒక పురుషుడు తాను ఒక స్త్రీని ఇష్టపడుతున్నానని, ఆమెతో సంబంధంలో ఉన్నానని చెబితే అతని తల్లిదండ్రులు లేదా ఇతరులు వివాహ బంధంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఆ భయంతో చాలా మంది పురుషులు లివింగ్ రిలేషన్‌షిప్ గురించి బహిర్గతం చేయడానికి జంకుతున్నారు.

లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుటికీ చాలా మంది యువతులు భాగస్వామిని హద్దులు దాటనివ్వరు. దాంతో ఆ రిలేషన్‌షిప్ కొనసాగుతుందో లేదో అనే భయంతో చాలా మంది మగవారు బంధం గురించి చెప్పడటానికి ఇష్టపడరు.

హేళన చేస్తారనే భయం

రిలేషన్‌షిప్‌ను త్వరతిగతిన వివాహ బంధంలోకి తీసుకెళ్లడానికి చాలా మంది మగవాళ్లు సాహసించరు. అదే సమయంలో భాగస్వామి నుంచి ఒత్తిడి ఎదురైతే.. ఆ బంధం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో అందరికీ విషయం తెలిస్తే హేళన చేస్తారనే భయంతో బంధాన్ని గోప్యంగా ఉంచుతారు.

బాధ్యతలకి దూరం

బాధ్యతలను పంచుకోవడానికి భయపడే మగవారు తమ రిలేషన్‌షిప్ గురించి గోప్యంగా ఉంచుతారు. భాగస్వామితో గడపడం వరకు ఓకే. కానీ బాధ్యతలు పంచుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్లు బ్రేకప్ చెప్పడానికి సిద్ధంగా ఉంటారు

Whats_app_banner