Janhvi Kapoor: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడల్లా అతనికి బ్రేకప్ చెప్పేదాన్ని: దేవర బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-janhvi kapoor says she has heartbreak only once because of shikhar paharia ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడల్లా అతనికి బ్రేకప్ చెప్పేదాన్ని: దేవర బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Janhvi Kapoor: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడల్లా అతనికి బ్రేకప్ చెప్పేదాన్ని: దేవర బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Jul 22, 2024 10:35 AM IST

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గతంలో తనకు పీరియడ్స్ వచ్చినప్పుడల్లా బాయ్ ఫ్రెండ్ శిఖర్ కు బ్రేకప్ చెప్పేదాన్ని అని ఆమె అనడం విశేషం.

నాకు పీరియడ్స్ వచ్చినప్పుడల్లా అతనికి బ్రేకప్ చెప్పేదాన్ని: దేవర బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నాకు పీరియడ్స్ వచ్చినప్పుడల్లా అతనికి బ్రేకప్ చెప్పేదాన్ని: దేవర బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Janhvi Kapoor: దేవర మూవీలో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం శిఖర్ పహారియాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. అతనితో పెళ్లెప్పుడన్నది చెప్పకపోయినా.. వీళ్లు కలిసి ఏడడుగులు వేసేది మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ఆమె ఎవరితో పెళ్లికి రెడీ అవుతోందో ఆ వ్యక్తి వల్లే తనకు జీవితంలో ఒకసారి హార్ట్‌బ్రేక్ అయిందని ఆమె చెప్పింది.

పీరియడ్స్ టైమ్‌లో బ్రేకప్..

శిఖర్ పహారియాతో తన రిలేషన్షిప్ ను జాన్వీ ఓపెన్ చేసేసింది. నిజానికి ఏ ఈవెంట్ కు వెళ్లినా.. ఇద్దరూ కలిసే కనిపిస్తున్నారు. అయితే ఈ జంట ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నా.. గతంలో ఒకసారి ఇలాగే డేటింగ్ చేసి తర్వాత విడిపోయిందన్న విషయం మీకు తెలుసా? తన జీవితంలో హార్ట్ బ్రేక్ అయిన సందర్భం అదొక్కటే అని తాజాగా హాటర్‌ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ చెప్పింది.

గతంలో శిఖర్ కు తాను ఎందుకు బ్రేకప్ చెప్పానో ఈ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. "నా పీరియడ్స్ లో మొదటి రెండేళ్ల పాటు ఈ వ్యక్తితో నేను ప్రతి నెల బ్రేకప్ అయ్యేదాన్ని. మొదటి రెండు, మూడు నెలలు అతడు షాక్ లో ఉండేవాడు. ఆ తర్వాత సరే అని అనేవాడు. రెండు రోజుల తర్వాత నేనే ఏడుస్తూ వెళ్లి అతనికి సారీ చెప్పేదాన్ని. నా మెదడు ఎందుకిలా పని చేస్తుందో నాకు అర్థం కాలేదు. చాలా తీవ్రంగా స్పందించేది" అని జాన్వీ చెప్పింది.

అతని వల్లే హార్ట్ బ్రేక్.. మళ్లీ..

తనకు ఎవరి వల్ల హార్ట్ బ్రేక్ అయిందో మళ్లీ అతడే దానిని ఫిక్స్ చేశాడని జాన్వీ తెలిపింది. "నా జీవితంలో ఒకే ఒక్కసారి మాత్రమే నిజంగా హార్ట్ బ్రేక్ అయింది. కానీ అదే మనిషి తిరిగి వచ్చి నా పగిలిన గుండెను మళ్లీ ఒక్కటి చేశాడు. అందువల్ల అంతా బాగానే ఉంది" అని జాన్వీ చెప్పింది. నిజానికి బాలీవుడ్ లో అడుగుపెట్టక ముందు ఈ శిఖర్ తో జాన్వీ డేటింగ్ లో ఉండేది.

అతనితో కొన్నాళ్లు బ్రేకప్ అయిన సమయంలో తన ఫస్ట్ మూవీ దఢక్ కోస్టార్ ఇషాన్ ఖట్టర్ తో డేటింగ్ చేసింది. అయితే కొన్నాళ్లకే వీళ్లు బ్రేకప్ అయ్యారు. ఆ సమయంలో మళ్లీ శిఖర్ తోనే జాన్వీ డేటింగ్ మొదలుపెట్టింది. ఇప్పటికీ వీళ్ల లవ్ స్టోరీ కొనసాగుతూనే ఉంది.

జాన్వీ బిజీ బిజీ

జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులతో బిజీబీజీగా ఉంది. ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ఉలఝ్ రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. ఈ సినిమాలో ఆమె సుహానా అనే డిప్యూటీ హైకమిషనర్ పాత్రలో కనిపిస్తోంది. ఈ మూవీ ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత మరో రెండు నెలల్లో ఆమె నటించిన తొలి తెలుగు మూవీ దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఇందులో ఆమె నటించింది.

దేవర మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. ఇదే కాదు తెలుగులో రామ్ చరణ్ తోనూ జాన్వీ నటిస్తోంది. ఆర్సీ16 మూవీలో జాన్వీ కన్ఫమ్ అయినట్లు గతంలోనే మేకర్స్ వెల్లడించారు. ఇక తమిళంలో సూర్యతో కలిసి మరో సినిమా, హిందీలో సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి మూవీలలోనూ నటిస్తోంది.

Whats_app_banner