Devara Second Song: రిలీజ్‍కు సిద్ధమవుతున్న దేవర రెండో పాట.. ఎప్పటి కల్లా రావొచ్చంటే!
Devara Second Song: దేవర సినిమా నుంచి రెండో పాటను తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ పాట ఎప్పటిలోగా రిలీజ్ కానుందో సమాచారం బయటికి వచ్చింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్‍లో రూపొందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావడంతో దేవరపై పాన్ ఇండియా రేంజ్‍లో హైప్ ఉంది. ఇప్పటికే వచ్చిన తొలి పాట ‘ఫియర్ సాంగ్’ ఊపేస్తోంది. ఈ తరుణంలో రెండో పాటను కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
ఈనెలలోనే రెండో పాట
దేవర సినిమా నుంచి రెండో పాట ఈ జూలై నెలలోనే రిలీజ్ అవడం ఖాయమని తెలుస్తోంది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇప్పటికే ఈ సెకండ్ సింగిల్ సిద్ధం చేసేశాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరో మూడు వారాల కల్లా దేవర నుంచి రెండో పాట వస్తుందనే బజ్ నడుస్తోంది.
దేవర నుంచి తొలి పాటగా వచ్చిన ‘ఫియర్ సాంగ్’ పవర్‌ఫుల్‍గా సాగింది. అయితే, త్వరలో వచ్చే రెండో పాట మెలోడియస్ డ్యూయెట్‍గా ఉంటుందట. జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్‌లతో ఈ పాట ఉంటుందని తెలుస్తోంది.
ఫియర్ సాంగ్ ఇప్పటికే చార్ట్ బస్టర్ అయింది. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన ఇంటెన్స్ బీట్ అదిరిపోయింది. ఇప్పటికే ఈ పాటకు భారీసంఖ్యలో వ్యూస్ వచ్చేశాయి. ఈ పాటతో దేవర మూవీపై హైప్ మరింత పెరిగింది. అనిరుధ్ బీజీఎంపై అంచనాలను మరింత అధికమయ్యాయి.
రిలీజ్ డేట్ ముందుకు..
దేవర సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. దసరా సందర్భంగా దేవర చిత్రాన్ని అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు గతంలో మూవీ టీమ్ ఫిక్స్ చేసింది. అయితే, పవన్ కల్యాణ్ మూవీ ఓజీ వాయిదా పడటంతో సెప్టెంబర్ 27వ తేదీని దేవర ఫిక్స్ చేసుకుంది. దీంతో ముందు ప్రకటించిన తేదీ కంటే రెండు వారాలు ఈ మూవీ ప్రీ-పోన్ అయింది.
దేవర షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం పాట చిత్రీకరణ జరుగుతోందని తెలుస్తోంది. అనుకున్న టైమ్ కల్లా షూటింగ్ పూర్తయ్యేలా డైరెక్టర్ కొరటాల శివ ప్లానింగ్‍తో ఉన్నారు. హైక్వాలిటీ వీఎఫ్‍ఎక్స్, భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందుతోంది.
దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ మూవీతోనే ఆమె తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కూడా దేవర చిత్రంలో కీలకపాత్రలు చేస్తున్నారు.
దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‍తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి రూపొందిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఈ మూపీకి సంగీతం అందిస్తున్నారు.
దేవర సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ చాలా నమ్మకంతో ఉన్నారు. అభిమానులు కాలర్ ఎగరేసేలా ఈ చిత్రం ఉంటుందని ఇప్పటికే చెప్పారు. గ్లింప్స్, పాట కూడా అదిరిపోవటంతో ఈ చిత్రంపై క్రేజ్ పెరుగూనే వస్తోంది. భారీగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. దేవర చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
టాపిక్