Janhvi Kapoor Hospitalised: ఆసుపత్రిలో చేరిన హీరోయిన్ జాన్వీ కపూర్
Janhvi Kapoor Hospitalised: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఆసుపత్రిలో చేరారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా కన్ఫర్మ్ చేశారని రిపోర్టులు బయటికి వచ్చాయి. ఆ వివరాలు ఇవే.
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రం మే నెలలో రిలీజ్ అయింది. జాన్వీ మెయిన్ రోల్ చేసిన స్పై థ్రిల్లర్ మూవీ ఉల్జా ట్రైలర్ ఇటీవలే వచ్చింది. దేవర చిత్రంతో తెలుగులోనూ జాన్వీ అడుగుపెడుతున్నారు. రామ్‍చరణ్‍తోనూ ఓ సినిమా చేయనున్నారు. ఇటీవలే అనంత్ అంబానీ - రాధిక మర్చెంట్ వివాహంలో జాన్వీ కపూర్ సందడి చేశారు. అయితే ఇంతలోనే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నేడు (జూలై 18) ఆసుపత్రిలో చేరారు.
ఫుడ్ పాయిజనింగ్ వల్ల..
కల్తీ ఆహారం వల్ల జాన్వీ కపూర్‌కు తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అయిందని తెలుస్తోంది. దీని కారణంగానే ఆమె ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారని సమాచారం బయటికి వచ్చింది. కల్తీ ఆహారం వల్ల కడుపులో ఆమెకు ఇబ్బంది ఏర్పడిందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ రేపు (జూలై 19) ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ కానున్నారట.
ఆగస్టులో ‘ఉల్జా’
ఉల్జా సినిమా ఆగస్టు 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ మెయిన్ రోల్ చేశారు. డిప్యూటీ హైకమిషనర్ సుహానా భాటియా క్యారెక్టర్‌లో నటించారు. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ చిత్రంగా రూపొందించారు దర్శకుడు సుధాన్షు సారియా. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఉల్జా చిత్రంలో జాన్వీ కపూర్‌తో పాటు రోషన్ మాథ్యూ, గుల్షన్ దేవైయా ప్రధాన పాత్రలు చేశారు. ఆదిల్ హుసేన్, మియాంగ్ చాంగ్, రాజేశ్ తైలంగ్, రాజేంద్ర గుప్తా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శాశ్వత్ సచ్‍దేవ్ సంగీతం అందించారు. పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై వినీత్ జైన్ నిర్మించారు.
దేవరతో టాలీవుడ్‍లోకి..
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‍గా చేస్తున్నారు. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో లంగావోణిలో పల్లెటూరి అమ్మాయిగా జాన్వీ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఆమె లుక్ ఆకట్టుకుంది. దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. దేవర చిత్రంలో తన పాత్ర చాలా బాగుంటుందని గతంలో జాన్వీ ఓసారి చెప్పారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.
మెగా పపర్ స్టార్ రామ్‍చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‍లో రూపొందనున్న మూవీలో (RC16)లో జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించనున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమానికి కూడా ఆమె హాజరయ్యారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆగస్టులో ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుందని అంచనాలు ఉన్నాయి. దేవర షూటింగ్ పూర్తయ్యాక జాన్వీ ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొననున్నారు.