Team India Schedule: అటు అమ్మాయిలు.. ఇటు అబ్బాయిలు.. ఒకేరోజు టీమిండియా మెన్స్, వుమెన్స్ టీమ్ మ్యాచ్‌లు.. లైవ్ ఇలా చూడండి-team india schedule india vs bangladesh india women vs sri lanka women on wednesday 9th october ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Team India Schedule: అటు అమ్మాయిలు.. ఇటు అబ్బాయిలు.. ఒకేరోజు టీమిండియా మెన్స్, వుమెన్స్ టీమ్ మ్యాచ్‌లు.. లైవ్ ఇలా చూడండి

Team India Schedule: అటు అమ్మాయిలు.. ఇటు అబ్బాయిలు.. ఒకేరోజు టీమిండియా మెన్స్, వుమెన్స్ టీమ్ మ్యాచ్‌లు.. లైవ్ ఇలా చూడండి

Published Oct 09, 2024 10:34 AM IST Hari Prasad S
Published Oct 09, 2024 10:34 AM IST

  • Team India Schedule: ఒకే రోజు టీమిండియా మెన్స్, వుమెన్స్ టీమ్స్ కీలకమైన మ్యాచ్ లు ఆడబోతున్నాయి. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత అమ్మాయిలు శ్రీలంకతో చావో రేవో అనే మ్యాచ్ లో తలపడనుండగా.. ఇటు బంగ్లాదేశ్ పై మరో టీ20 సిరీస్ విజయంపై కన్నేసింది సూర్యకుమార్ సేన. మరి ఈ మ్యాచ్ లు ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Team India Schedule: టీమిండియా మెన్స్, వుమెన్స్ టీమ్స్ ఒకే రోజు తలపడటం కాస్త అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బుధవారం (అక్టోబర్ 9) కూడా ఈ రెండు జట్లు ఆడుతున్నాయి. మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, శ్రీలంక.. ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ లు జరగనున్నాయి.

(1 / 5)

(Getty)

Team India Schedule: మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన టీమిండియా.. రెండో మ్యాచ్ లో పాకిస్థాన్ పై గెలిచి బోణీ చేసింది. ఇక ఇప్పుడు మూడో మ్యాచ్ లో ఆసియా కప్ ఛాంపియన్స్ శ్రీలంకతో చావో రేవోలాంటి మ్యాచ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. 

(2 / 5)

Team India Schedule: ఇక ఇటు మెన్స్ టీమ్ బంగ్లాదేశ్ పై టీ20 సిరీస్ విజయంపై కన్నేసి రెండో టీ20 బరిలోకి దిగుతోంది. ఇప్పటికే తొలి టీ20లో సులువుగా గెలిచిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది.

(3 / 5)

Team India Schedule: మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, శ్రీలంక మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ఉంటుంది. ఇక ఆన్‌లైన్లో అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

(4 / 5)

Team India Schedule: ఇక ఇండియా, బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ద్వారా టీవీలో చూడొచ్చు. ఆన్‌లైన్లో అయితే జియో సినిమాలో ఫ్రీగా ఈ మ్యాచ్ చూసే అవకాశం ఉంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు