ఒక రిలేషన్‌షిప్ విజయవంతం కావడానికి ఇరువైపులా చాలా శ్రమ అవసరం. విజయవంతమైన సంబంధం అంటే చాలా కాలం పాటు సాగేది అని కాదు, కానీ అందులో పాల్గొన్న వ్యక్తులు సురక్షితంగా, సంతోషంగా ఉండడం. ప్రతి వ్యక్తి వారి సొంత గాయాలు, ఆశయాలు, కలలు, ఆకాంక్షలను ప్రస్తుత బంధంలోకి తీసుకొస్తారు. వ్యక్తుల మధ్య ప్రేమ ఉండటమే ముఖ్యం అయితే, అది వ్యక్తిగతంగా, కలిసి వృద్ధి చెందడానికి సురక్షితమైన బంధంగా కూడా ఉండాలి. ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన కొన్ని ధృవీకరణలు (affirmations) ఉన్నాయి. దీనిని ప్రస్తావిస్తూ సైకోథెరపిస్ట్ ఎమిలీ హెచ్ సాండర్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పలు విషయాలు చర్చించారు.
వన్ సైడ్ రిలేషన్ షిప్: భయం వల్ల లేదా ఒంటరితనం వల్ల లేదా కొన్నిసార్లు తప్పు అన్న భావన వల్ల మనం వన్ సైడెడ్ రిలేషన్‌షిప్‌లో ఉండిపోతాం. ఇది ఎమోషనల్‌గా ఇది మనల్ని మరింత బాధిస్తుంది. మనం ఊహించలేనంత నష్టం జరిగిపోతుంది.
స్పష్టత: రిలేషన్‌షిప్‌లో మనం ఏం కోరుకుంటున్నామో, అవతలి వ్యక్తి ఏం కోరుకుంటున్నారో స్పష్టత చాాలా అవసరం. అప్పుడే మీ రిలేషన్‌షిప్ ముందుకు సాగుతుంది.
వ్యక్తిత్వం, విలువలు: దీర్ఘకాలంలో శారీరక సౌష్టవం వెనక్కి వెళ్లిపోతుంది. వ్యక్తిత్వం, వారు ఆచరించే విలువలే ప్రేమను నిర్దేశిస్తాయి.
మాట: ఒక వ్యక్తి తనకు ఆసక్తి లేదని గానీ, రిలేషన్‌షిప్‌లో ఉండేందుకు సిద్ధంగా లేనని గానీ చెప్పినప్పుడు వారి మాటల్ని మీరు సీరియస్‌గా తీసుకోవాలి. అవతలి వ్యక్తిని ఒప్పించడానికి ప్రయత్నించడం మానేయాలి.
ప్రవర్తన: ఒక వ్యక్తి నిర్ధిష్ట మార్గంలో తన ప్రవర్తనను తరచుగా రిపీట్ చేస్తుంటే మీరు దాని గురించి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. అది వారి అంతర్ ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుందని తెలుసుకోవాలి.
సహాయం: మనం తరచుగా సాయం కోరడం మనల్ని బలహీనులుగా మారుస్తుందని భావిస్తుంటాం. కానీ అది నిజం కాదు. అది మన భావోద్వేగ సమయంలో అవతలి వ్యక్తి మనల్ని కలవడానికి ఉపయోగపడుతుంది.
మాటలు, చేతల పొంతన: మాటలు, చేతలు పొంతన కలిసిన వ్యక్తితోనే బంధంలో ఉండడం మంచిది.
సంబంధిత కథనం
టాపిక్